సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. విద్యార్హత డిగ్రీ

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. స్పెషలిస్ట్ కేటగిరీలో ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో ఉన్న మొత్తం 192 ఖాళీలను బర్తీ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పలు శాఖల్లో వేర్వేరు స్ట్రీమ్స్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఈ ఖాళీలు ఉన్నాయి. మొత్తం 192 ఖాళీలకు గాను.. ఆఫీసర్ (స్పెషలిస్ట్ కేటగిరీ) స్కేల్ I: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(15), రిస్క్ మేనేజర్(2), సెక్యూరిటీ ఆఫీసర్(15), లైబ్రేరియన్(1) చొప్పున పోస్టుల్ని భర్తీ చేయనుండగా.. స్కేల్ -2లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(73), లా ఆఫీసర్(15), క్రెడిట్ ఆఫీసర్(50), ఫైనాన్సియల్ అనలిస్ట్(4), సీఏ -ఫైనాన్స్/అకౌంట్స్/జీఎస్టీ/ Ind AS/బ్యాలెన్స్ షీట్/ట్యాక్సేషన్ (3); స్కేల్ IIIలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (6), ఫైనాన్సియల్ అనలిస్ట్ (5), స్కేల్ IV రిస్క్‌మేనేజర్ (1); స్కేల్ Vలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (1), రిస్క్ మేనేజర్ (1) చొప్పు ఉన్నాయి. పైన తెలిపిన పోస్టులకు...