డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీగా ఉద్యోగాలు ..

న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో.. దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 15వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు.. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/ఎగ్జిక్యూటివ్ పోస్టులు 995 ఉన్నాయి. వీటిలో జనరల్ కేటగిరీలో 377 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 129 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 222 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 134 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 133 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు డిసెంబర్ 15, 2023 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి కలి...