డిగ్రీ అర్హతతో 8,773 SBI లో ఉద్యోగాలు..
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది
దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI ).. భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 8773 క్లర్క్ (Junior Associate) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు డిసెంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్/ చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక.. అభ్యర్థుల వయసు 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ(జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://sbi.co.in/web/careers వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
- విద్యార్థత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఫైనలియర్ విద్యార్థులు కూడా అర్హులే.
- వయసు: అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక విధానం : ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేపడతారు.
- దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి.
- దరఖాస్తులు ప్రారంభతేదీ: నవంబర్ 17, 2023
- దరఖాస్తులకు చివరితేదీ : డిసెంబర్ 7, 2023
| ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
| నోటిఫికేషన్ PDf | CLICK HERE |
| అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
| వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
| టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |

Comments
Post a Comment