రసాయన రాయబారులు అని వేటిని అంటారు? | What are chemical ambassadors?

 రసాయన రాయబారులు అని వేటిని అంటారు? | What Are Chemical Ambassadors ?



అంతస్రావిక వ్యవస్థ


మానవుని శరీరానికి సంబంధించి అన్ని రకాల జీవక్రియలను సమన్వయపరిచే వ్యవస్థనే ‘అంతస్రావిక వ్యవస్థ’ అంటారు. అంతస్రావిక వ్యవస్థ గురించి చదివే శాస్త్రం- ఎండోక్రినాలజీ
అంతస్రావిక వ్యవస్థలో రెండు రకాల గ్రంథులు ఉన్నాయి.

అవి..
1) నాళ గ్రంథులు/బాహ్యస్రావిక గ్రంథులు
ఈ గ్రంథులు ‘ఎంజైమ్‌’లను స్రవిస్తాయి.

2) వినాళ గ్రంథులు/అంతస్రావిక గ్రంథులు
ఇవి ‘హార్మోన్‌’లను స్రవిస్తాయి.

హార్మోన్స్‌
హార్మోన్లను ‘రసాయన రాయబారులు అంటారు.
హార్మోన్లను 1905లో ‘బేలిస్‌ అంట్‌ స్టార్లింగ్‌’ కనుగొన్నారు.
అంతస్రావిక గ్రంథులు 5 రకాలుగా ఉంటాయి.

అవి..
1) థైరాయిడ్‌ గ్రంథి 2) అథివృక్క గ్రంథి
3) పీయూష గ్రంథి 4) బాల గ్రంథి
5) పీనియల్‌ గ్రంథి

ముష్కాలు
ఇవి ముష్క గోణుల్లో అమరి ఉంటాయి.
ముష్కాలు అనేవి ‘టెస్టోస్టిరాన్‌’ అనే హార్మోన్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్‌ ‘శుక్రకణాల ఉత్పత్తి’లో పాల్గొంటుంది. పురుషుల్లో ‘ద్వితీయ లైంగిక లక్షణాలు’ ఏర్పడటానికి తోడ్పడుతుంది.
టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ లోపిస్తే ‘పురుషుల్లో వంధ్యత్వం వస్తుంది.

స్త్రీ బీజకోశాలు
ఇవి స్త్రీలలో ‘ఉదర భాగం’లో ఉంటాయి. వీటిలో 3 రకాల హార్మోన్లు ఉంటాయి.
1) ఈస్ట్రోజెన్‌
ఇది స్త్రీలలో ‘అండాల విడుదలలో, ద్వితీయ లైంగిక లక్షణాలు ఏర్పడటంలో తోడ్పడుతుంది.
2) ప్రొజెస్టిరాన్‌
ఈ హార్మోన్‌ గర్భాశయంలోని ‘పిండ ప్రతిస్థాపనకు’ సహాయపడుతుంది.
3) అయిస్ట్రాయిడల్‌ హార్మోన్‌
ఇది గర్భాశయం పెరుగుదల, కడ్డీ వలయం పెరుగుదల, స్త్రీలల్లో 28 రోజుల రుతుచక్ర నియంత్రణకు సహాయపడుతుంది.
థైరాయిడ్‌ గ్రంథి/అవటు గ్రంథి
ఈ గ్రంథి వినాళ గ్రంథుల్లోకెల్లా/అంతస్రావిక గ్రంథుల్లోకెల్లా అతిపెద్దది.
ఇది గొంతు భాగంలో ఉంటుంది.
ఇది ‘H’ ఆకారంలో ఉంటుంది.
దీనిని ‘ఆడమ్స్‌ యాపిల్‌’ అంటారు.
ఇది ‘థైరాక్సిన్‌ హార్మోన్‌’ని స్రవిస్తుంది.

థైరాక్సిన్‌
దీనిలో ‘అయోడిన్‌’ మూలకం ఉంటుంది.
అయోడిన్‌ లోపించడం వల్ల ‘సామాన్య గాయిటర్‌’ వస్తుంది.
థైరాక్సిన్‌ చిన్నపిల్లల్లో లోపిస్తే ‘క్రిటినిజం’ అనే వ్యాధి వస్తుంది.
ఈ వ్యాధి లక్షణం బుద్ధి మందగించడం.
థైరాక్సిన్‌ లోపం వల్ల పెద్దవారిలో వచ్చే వ్యాధి మిక్సిడోమా. ఈ వ్యాధి లక్షణం కనుగుడ్లు బయటకు పొడుచుకుని రావడం.

అథివృక్క గ్రంథి
ఇది మూత్రపిండాలకు అంటిపెట్టుకుని ఉంటుంది.
దీనిని ‘సూప్రారీనల్‌ గ్రంథి/ఎడ్రినల్‌ గ్రంథి’ అంటారు.
అథివృక్క గ్రంథిలో రెండు భాగాలు ఉన్నాయి. 1) వల్కలం 2) దవ్వ వల్కలం
ఇది 3 రకాల హార్మోన్లను స్రవిస్తుంది.
1) ఆండ్రోజెన్‌ 2) కార్టిసాల్‌
3) అల్డోస్టిరాన్‌

ఆండ్రోజెన్‌
ఈ హార్మోన్లు ‘స్త్రీలలో ఎక్కువైతే విరిలిజం వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి లక్షణం మీసాలు, గడ్డాలు రావడం.
కార్టిసాల్‌
ఈ హార్మోన్‌ ఎక్కువ కావడం వల్ల ‘బఫెలో నెక్‌’ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి లక్షణం మెడపై భాగంలో కొవ్వు పేరుకుపోవడం.

అల్డోస్టిరాన్‌
ఈ హార్మోన్‌ లోపం వల్ల ఎడిసన్స్‌ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి లక్షణం చర్మం ఇతర రంగుల్లోకి మారడం.
ముఖంపై మచ్చలు ఏర్పడటం.
ఇది 2 రకాల హార్మోన్లను స్రవిస్తుంది.
1) అడ్రినలిన్‌ 2) నాన్‌ అడ్రినలిన్‌

అడ్రినలిన్‌
ఈ హార్మోన్‌ను పోరాట పలాయన హార్మోన్‌ లేదా 3F హార్మోన్‌ అంటారు.
ఈ హార్మోన్‌ భావోద్వేగ సమయంలో విడుదలవుతుంది.

నాన్‌ అడ్రినలిన్‌
ఈ హార్మోన్‌ ‘మానవుని రక్తపీడనాన్ని నియంత్రిస్తుంది.

పీయూష గ్రంథి/పిట్యూటరీ గ్రంథి
ఈ గ్రంథి మెదడులో ఉంటుంది.
దీనిని మాస్టర్‌ గ్లాండ్‌/గ్రంథుల్లోకెల్లా అతి ప్రధాన గ్రంథి.
ఈ గ్రంథి ‘బఠాణీ గింజ’ ఆకారంలో ఉంటుంది.
ఈ గ్రంథి మానవుని శరీరంలో ఉండే అతి చిన్న గ్రంథి/ వినాళ గ్రంథుల్లోకెల్లా/ అంతస్రావిక గ్రంథుల్లోకెల్లా అతి చిన్నది.
ఈ గ్రంథి వివిధ రకాల హార్మోన్లను స్రవిస్తుంది.

సొమాటో-ట్రాపిక్‌ హార్మోన్‌ (ఎస్‌టీహెచ్‌)
దీనిని పెరుగుదల హార్మోన్‌/ గ్రోత్‌ హార్మోన్‌ అంటారు.
ఈ హార్మోన్‌ చిన్నపిల్లల్లో తక్కువైతే ‘మరుగుజ్జుతనం (డ్వార్ఫిజం)’ వస్తుంది.
ఈ హార్మోన్‌ చిన్నపిల్లల్లో ఎక్కువైతే ‘అతిదీర్ఘకాయత్వం (జైగాంటిజం)’ వస్తుంది.

థైరో-ట్రాపిక్‌ హార్మోన్‌
ఈ హార్మోన్‌ ‘థైరాయిడ్‌పై ప్రభావం చూపుతుంది’.

గోనాడో-ట్రాపిక్‌ హార్మోన్‌
ఈ హార్మోన్‌ ‘ముష్కాలు, స్త్రీ బీజకోశాల’పై ప్రభావం చూపుతుంది.

ఎఫ్‌ఎస్‌హెచ్‌
ఫాలికల్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌- ఎఫ్‌ఎస్‌హెచ్‌
ఈ హార్మోన్‌ స్త్రీలలో ‘అండాలను విడుదల చేసే ఈస్ట్రోజెన్‌ అనే హార్మోన్‌ను ప్రేరేపిస్తుంది. పురుషుల్లో శుక్రకణాల విడుదలకు సహాయపడుతుంది.

ఎల్‌హెచ్‌
ల్యూటినైజింగ్‌ హార్మోన్‌- ఎల్‌హెచ్‌
ఈ హార్మోన్‌ స్త్రీలల్లో విడుదలైన అండం ఫాలోపియన్‌ నాళం ద్వారా వెళ్లడానికి తోడ్పడుతుంది.

వాసోప్రెసిన్‌
ఈ హార్మోన్‌ లోపం వల్ల ‘అతిమూత్ర వ్యాధి/డయాబెటిస్‌ ఇన్‌సిపిడస్‌’ వస్తుంది.
అతిమూత్ర వ్యాధి వచ్చిన వ్యక్తి ప్రతిరోజూ 5 లీటర్ల మూత్రం విసర్జిస్తాడు.
మానవుడు ఒక్కరోజుకు విసర్జిస్తున్న మూత్రం 1.5 లీటర్లు

ప్రొలాక్టిన్‌
ఈ హార్మోన్‌ స్త్రీలలో పాల ఉత్పత్తికి సహాయపడుతుంది.

ఆక్సిటోసిన్‌
ఈ హార్మోన్‌ గర్భాశయంలోని మృదు కండరాలను వదులు చేస్తుంది.

బాల గ్రంథి/థైమస్‌ గ్రంథి
దీనిని తాత్కాలిక అంతస్రావిక గ్రంథి అని అంటారు.
ఇది గుండెకు, 2 ఊపిరితిత్తులకు మధ్య ఉంటుంది.
ఇది థైమోసిన్‌ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది.

థైమోసిన్‌
ఇది చిన్నపిల్లల్లో ఉండి కౌమార దశలో అంతం అవుతుంది.
ఈ హార్మోన్‌ చేసే ముఖ్య పని తెల్ల రక్తకణాల్లో ఉండే 3 లింఫోసైట్స్‌ కణాల సంఖ్యను పెంచుతుంది. దీని ద్వారా ఆ వ్యక్తి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

పీనియల్‌ గ్రంథి
ఇది పీయూష గ్రంథి కంటే చిన్నది.
ఇది మెలటోనిన్‌ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది.

మెలటోనిన్‌
ఈ హార్మోన్‌లో ‘మెలనిన్‌’ అనే రంగు పదార్థం ఉంటుంది. ఇది చర్మానికి రంగును ఇస్తుంది.

ప్రాక్టీస్‌ బిట్స్‌

  1. అంతస్రావిక వ్యవస్థ గురించి చదివే శాస్ర్తాన్ని ఏమని పిలుస్తారు?
    1) ఎండోక్రినాలజీ 2) ఫ్రీనాలజీ
    3) క్రినాలజీ 4) న్యూరాలజీ

  2. కింది వాటిలో సరికానిది?
    1) థైరాయిడ్‌ గ్రంథి- థైరాక్సిన్‌
    2) పీయూష గ్రంథి- వాసోప్రెసిన్‌
    3) అడ్రినల్‌ గ్రంథి- కాల్సిటోసిన్‌
    4) బాలగ్రంథి- థైమోసిన్‌

  3. కింది వాటిని జతపర్చండి.
    ఎ. ఎడిసన్స్‌ 1. STH
    బి. విరిలిజం 2. అల్డోస్టిరాన్‌
    సి. మిక్సిడోమా 3. థైరాక్సిన్‌
    డి. జైగాంటిజమ్‌ 4. ఆండ్రోజెన్‌
    1) ఎ-4, బి-3, సి-2, డి-1
    2) ఎ-2, బి-4, సి-3, డి-1
    3) ఎ-2, బి-4, సి-1, డి-3
    4) ఎ-3, బి-4, సి-2, డి-1

  4. మాస్టర్‌ గ్లాండ్‌ అని ఏ గ్రంథిని పిలుస్తారు?
    1) పీయూష గ్రంథి 2) బాలగ్రంథి
    3) థైరాయిడ్‌ గ్రంథి 4) పీనియల్‌ గ్రంథి

  5. ‘హార్మోన్ల’ను కనుగొన్న శాస్త్రవేత్త?
    1) స్టార్లింగ్‌ 2) ఫంక్‌ 3) డేవిస్‌ 4) స్టీనర్‌

  6. సూప్రారీనల్‌ గ్రంథి అని దేనిని పిలుస్తారు?
    1) థైరాయిడ్‌ గ్రంథి 2) బాలగ్రంథి
    3) పీయూష గ్రంథి 4) అధివృక్క గ్రంథి

  7. ఆడమ్స్‌ యాపిల్‌ అని ఏ గ్రంథిని పిలుస్తారు?
    1) బాలగ్రంథి 2) పీయూషగ్రంథి
    3) పిట్యూటరీ గ్రంథి 4) థైరాయిడ్‌ గ్రంథి

  8. కింది వాటిలో సరైనది?
    1) థైరాయిడ్‌ గ్రంథిని మాస్టర్‌ గ్లాండ్‌
    అని అంటారు
    2) పీయూష గ్రంథిని సూప్రారీనల్‌
    గ్రంథి అని అంటారు
    3) అధివృక్క గ్రంథిని అడ్రినల్‌ గ్రంథి అని అంటారు
    4) బాలగ్రంథి మూత్రపిండాలకు అంటిపెట్టుకుని ఉంటుంది

  9. వాసోప్రెసిన్‌ అనే హార్మోన్‌ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది?
    1) షుగర్‌ వ్యాధి 2) అతిమూత్ర వ్యాధి
    3) ఎడిసన్స్‌ 4) డ్వార్ఫిజం

  10. కింది వాటిలో మెదడులో ఉండే గ్రంథి?
    1) పీయూష గ్రంథి 2) బాలగ్రంథి
    3) థైరాయిడ్‌ గ్రంథి 4) అధివృక్క గ్రంథి

  11. కింది వాటిని జతపర్చండి.
    ఎ. ఆక్సిటోసిన్‌ 1. పాలు
    బి. ప్రోలాక్టిన్‌ 2. గర్భాశయం
    సి. థైరాక్సిన్‌ 3. బీపీ
    డి. నాన్‌ అడ్రినల్‌ 4. అయోడిన్‌
    1) ఎ-2, బి-3, సి-4, డి-1
    2) ఎ-2, బి-1, సి-4, డి-3
    3) ఎ-2, బి-4, సి-1, డి-3
    4) ఎ-4, బి-3, సి-2, డి-1

  12. భావోద్వేగ సమయాల్లో ఏ హార్మోన్‌ విడుదలవుతుంది?
    1) అడ్రినల్‌ 2) నాన్‌ అడ్రినల్‌
    3) ఆక్సిటోసిన్‌ 4) థైరాక్సిన్‌

  13. ‘తాత్కాలిక అంతస్రావిక గ్రంథి’ అని దేనిని పిలుస్తారు?
    1) థైరాయిడ్‌ గ్రంథి 2) బాలగ్రంథి
    3) పీయూష గ్రంథి 4) అధివృక్క గ్రంథి

  14. ‘వ్యాధి నిరోధక శక్తి’ని పెంచే హార్మోన్‌?
    1) థైమోసిన్‌ 2) థైరాక్సిన్‌
    3) ఆక్సిటోసిన్‌ 4) అడ్రినల్‌

  15. చర్మానికి రంగును కలుగజేసే హార్మోన్‌?
    1) మెలటోనిన్‌ 2) థైమోసిన్‌
    3) థైరాక్సిన్‌ 4) కాల్సిటోసిన్‌


  16. జవాబులు 


    Ans

Comments

Popular posts from this blog

తెలుగు ప్రజల కోసం 25 తెలుగు పేపర్స్ ఒకే చోట

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల