నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు
నవోదయ విద్యాలయ సమితి(ఎన్వీఎస్) - దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ (జేఎన్వీఎస్) ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. విద్యార్థులు సొంత జిల్లాకు చెందిన జేఎన్వీలోనే చేరాల్సి ఉంటుంది. భోజన, వసతి సౌకర్యాలతోపాటు బోధన ఉచితం అయినప్పటికీ 'విద్యాలయ వికాస నిధి' నిమిత్తం నెలకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. బాలికలు; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు; పేదింటి పిల్లలకు దీని నుంచి మినహాయింపు వర్తిస్తుంది. యూనిఫాం, పాఠ్య పుస్తకాలు ఉచితంగానే అందిస్తారు.
జేఎన్వీలు - సీట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 13 జేన్వీలు ఉన్నాయి.
అనంతపురం 1, చిత్తూరు 9, తూర్పు గోదావరి 3, గుంటూరు 5, కడప 6, కృష్ణ 4, కర్నూలు 4,
నెల్లూరు 5, ప్రకాశం 7, శ్రీకాకుళం 2, విశాఖపట్నం 2, విజయనగరం 5, పశ్చిమ గోదావరి 6 ఖాళీలు ఉన్నాయి.
• తెలంగాణకు సంబంధించి 9 జేఎన్వీలు ఉన్నాయి.
అదిలాబాద్ 3, కరీంనగర్ 2, ఖమ్మం 4, మహబూబ్ నగర్ 6, మెదక్ 4, నల్లగొండ 9, నిజామాబాద్ 4, వరంగల్ 1, రంగారెడ్డి 3 ఖాళీలు ఉన్నాయి. అర్హత: ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు 2008 మే 1 నుంచి 2010 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి.
జేఎన్వీ సెలెక్షన్ టెస్ట్: పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వ హిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు.
ఇంగీష్ నుంచి 15 మార్కులు, హిందీ నుంచి 15, మేథ్స్ నుంచి 35, సైన్స్ నుంచి 35 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.
సమాధానాలను ఓఎంఆర్ పత్రం మీద గుర్తించాలి. ప్రశ్న లన్నీ ఎనిమిదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. పరీక్షను హిందీ,
ఇంగ్లీష్ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. =
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 15
జేఎన్వీ సెలెక్షన్ టెస్ట్ తేదీ: 2023 ఫిబ్రవరి 11
పరీక్ష కేంద్రాలు: జిల్లాలవారీ కేటాయించిన జవహర్ నవోదయ విద్యాలయాలు వెబ్సైట్: www.navodaya.gov.in

Comments
Post a Comment