యువతకు విదేశాల్లో భారీగా ఉద్యోగావకాశాలు - రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ,రిజిస్ట్రెషన్ చేసుకొండి
నైపుణ్యం గల తెలంగాణ యువతకు గల్ఫ్ తో పాటు ఇతర దేశాల్లో భారీగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మానవ వనరులు అవసర మున్న దేశాలను గుర్తించి, ఆయా దేశాల రాయబారులతో సంప్రదింపులు జరిపి అవసరాల మేరకు నియామక ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి (సీఎస్) సోమేశ్కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తు న్నారు. విదేశీ ఉద్యోగాల పేరిట జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు... వారికి ప్రభుత్వపరంగా ఉద్యో గావకాశాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం 2016లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్)ను ఏర్పాటు చేసింది.
ఇటీవల ఉద్యోగ నియామకాల కోసం టామ్కామ్ను విదేశీ సంస్థలు సంప్రదిస్తున్నాయి. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని టామ్కామ్ తరఫున ఆయా దేశా లోని భారత రాయబారులకు లేఖలు రాస్తోంది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సౌదీ అరేబియా, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఖతార్, కువైట్లతో పాటు జపాన్, పోర్చుగల్, జర్మనీ.. దేశాలకు లేఖలు రాసింది.
ఉద్యోగాలను ఆశించే వారు టామ్కామ్ వెబ్సైట్
http://tomcom.telangana.gov.in/OnlineRegistrationNew.aspx తమ పేర్లను నమోదు చేసుకోవాలి.
ఆధార్ లేదా పాస్పోర్ట్లో ఉన్న పేరు, తల్లిదండ్రులు, పుట్టిన తేదీ, కావాల్సిన ఉద్యోగం, ఫోన్ నంబర్, చిరునామా, విద్యార్హతలు, ప్రత్యేక నైపుణ్యం ఉంటే ఆ వివరాలు, శిక్షణ పొందిన సంస్థ పేరు, అనుభవం, విదేశాల్లో ఉద్యోగం చేసిన వారైతే ఏ దేశంలో, ఏ సంస్థలో, ఏ హోదాతో పనిచేస్తున్నారు. గతంలో పనిచేస్తే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు. పాస్పోర్ట్ వివరాలు, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఆ సమాచారంతో పాటు అభ్యర్థి ఫొటో (సంతకం చేసింది), ఆధార్ కార్డులను జత చేయాలి. విదేశాలకు ఉద్యోగాలకు వెళ్లే ముందు ఇచ్చే శిక్షణ కార్యక్రమాన్ని టామ్ కామ్ ఆరు జిల్లాల్లో నిర్వహిస్తోంది. దీనికి కూడా అభ్యర్థులపై వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.
ఏయే ఉద్యోగాలు
నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆటోమొబైల్ వైమానిక, భవన నిర్మాణం, నిర్వహణ, యంత్ర విధ తయారీ, ఆతిథ్యరంగం, పారిశ్రామి యంత్రాలు, వ్యవసాయం, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్ ఆహారం, శీతల పానీయాలు, నౌకాయానం, మత్స్యరం గంలో ఉద్యోగాలున్నాయి. లక్ష మందికి పైగా నర్సింగ్, ఆసుపత్రి సిబ్బంది అవసరమని గల్ దేశాలు సమాచారం అందించాయి. నర్సింగ్లో 6 వేల మంది సిబ్బంది కావాలని జపాన్ కోరింది. ఇంకా ఆహార, శీతల పానీయాలు సేవా రంగంలో 53 వేలు భవన నిర్మాణంలో 40 వేలు, పారిశుద్ధ్య సిబ్బంది 3 వేలు, ఆహార తయారీ రంగంలో 34 వేలు, వాహ రంగంలో 22 వేలు, వ్యవసాయ రంగంలో 36,500 యంత్ర పరికరాల తయారీలో 21 వేలు, నౌకా నిర్మాణ, యంత్రాల తయారీ పరిశ్రమలో 13 వేల మత్స్యరంగంలో 9 వేలు, పారిశ్రామిక రంగంలో 5,250, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్ లో 4,700 మంది అవస మని ఆ దేశం పేర్కొంది.
Comments
Post a Comment