JEE Main 2023 రిజిస్ట్రేషన్‌ తేదీలు మేము ఇవ్వలేదు.. అది ఫేక్‌ నోటీస్‌’: ఎన్టీఏ

 జాయింగ్‌ ఎట్రన్స్ ఎగ్జామినేషన్‌ (మెయిన్‌) 2023 తొలి విడత పరీక్ష వచ్చే జనవరిలో, తుది విడత ఏప్రిల్‌లో నిర్వహించేందుకు సన్నద్దమవుతున్నట్లు సోషల్‌ మీడియాలో చక్కర్లుకొడుతున్న వార్తలపై నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ..


సదరు ఫేక్‌ నోటీస్‌ ప్రకారం.. జేఈఈ మెయిన్‌ తొలి విడత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నవంబర్‌లో ప్రారంభమవుతుందని, డిసెంబర్‌ 31 నాటికి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొంది. ఇక దీనికి సంబంధించిన పరీక్ష జనవరి 18 నుంచి 23 వరకు నిర్వహిస్తుందని, సెషన్‌-2 పరీక్ష ఏప్రిల్‌ 4 నుంచి 9 వరకు జరగనుందని ఎన్‌టీఏ పేరుతో సామాజిక మాధ్యమాల్లో నిన్న చక్కర్లు కొడుతున్న నకిళీ ప్రకటన సారాంసం. దీనిపై స్పందించిన అధికారులు తాము ఎటువంటి తేదీలను నిర్ణయించలేదని స్పష్టంచేశారు.

కాగా ఈ ఏడాది కూడా జేఈఈ 2022 రెండు సెషన్లలో జూన్‌ 20 నుంచి 29 వరకు తొలి దశ, జులై 21 నుంచి 30 వరకు రెండు దశల్లో పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఏన్టీఏ ప్రతీయేట జేఈఈ మెయిన పరీక్ష నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. దీనిలో అర్హత సాధించిన వారు జేఈఈ అడ్వాన్స్‌కు హాజరుఅవుతారు. దీనిలో సాధించిన ర్యాంకు ఆధారంగా దేశంలో ప్రసిద్ధ ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఈఎస్టీ, ఐఐఐటీ ఇతర సంస్థల్లో బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే.

Comments

Popular posts from this blog

తెలుగు ప్రజల కోసం 25 తెలుగు పేపర్స్ ఒకే చోట

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల