ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలు..నిరుద్యోగులకు అలర్ట్.

రైల్వేలో ఉద్యోగం సాధించాలనే కోరిక ఉన్న వారికి రైల్వే శాఖ శుభవార్త అందించింది. దక్షిణ రైల్వే వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.




దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2 జనవరి 2023. ఈ నోటిఫికేషన్ ద్వారా 21 పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iroams.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు


అర్హత

12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు 7వ CPC పే మ్యాట్రిక్స్ స్థాయి 2/3లో పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  గ్రాడ్యుయేట్ అభ్యర్థులు మాత్రమే 7వ CPC పే మ్యాట్రిక్స్ స్థాయి 4/5లో పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.(


వయో పరిమితి

అభ్యర్థి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు కూడా నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. 


దరఖాస్తు ఫీజు..

జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.500గా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళలు/మాజీ సైనికులు/పీడబ్ల్యూడీ/మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులు మరియు ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు ఫీజు రూ. 250గా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్/క్రెడిట్ కార్డ్ ద్వారా ఫీజు చెల్లింపు చేయవచ్చు


ఇలా దరఖాస్తు చేసుకోండి

ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు iroams.com అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఇక్కడ వెబ్‌సైట్‌లో ఇవ్వబడిన అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి

ఇప్పుడు ఫారమ్‌లో అడిగిన సమాచారాన్ని సమర్పించండి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి. తర్వాత దరఖాస్తు పీజును చెల్లించాలి. మొత్తం సమాచారాన్ని సమర్పించిన తర్వాత.. దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకొని.. ప్రింట్ తీసుకోవాలి. ఇది భవిష్యత్ అవసరాల కొరకు ఉపయోగపడుతుంది

Comments

Popular posts from this blog

తెలుగు ప్రజల కోసం 25 తెలుగు పేపర్స్ ఒకే చోట

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల