IT Jobs | భారీగా నియామకాలు చేపనున్నట్లు దిగ్గజ ఐటీ కంపెనీ వెల్లడించింది.
ఉద్యోగాల వేటలో ఉన్నారా? జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారా? లేదంటే ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా? మీకు శుభవార్త. దేశీ దిగ్గజ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కీలక ప్రకటన చేసింది.
.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1.25 లక్షల నుంచి 1.5 లక్షల మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు వెల్లడించింది. ఉద్యోగం కోసం చూసే వారికి ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. దిగ్గజ ఐటీ కంపెనీలో జాబ్ కొట్టేసుకోవచ్చు.
కాగా టీసీఎస్ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య కొంచెం తగ్గినట్లు తెలుస్తోంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ఉద్యోగుల సంఖ్య 2,197 తగ్గిందని కంపెనీ తెలిపింది. 6.13 లక్షలుగా నమోదు అయ్యిందని పేర్కొంది. గత 18 నెలల కాలంలో అదిక రిక్రూట్‌మెంట్ కారణంగా కాస్త తగ్గినట్లు కనిపిస్తోందని కంపెనీ వెల్లడించింది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.25 లక్షల నుంచి 1.5 లక్షల మందిని నియమించుకోనున్నామని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్ గోపీనాథన్ తెలిపారు. ఉద్యోగులను తొలగించడం లేదని, మరింత మందికి నియమించుకోనున్నామని ఆయన పేర్కొన్నారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో 1.03 లక్షల మందిని నియమించుకున్నామని కంపెనీ వెల్లడించింది. 2022-23లో ఇప్పటికే 55 వేల మందికి నియమించుకున్నట్లు తెలిపింది. డిసెంబర్ త్రైమాసికంలో నికరంగా చూస్తే ఉద్యోగుల సంఖ్య 2197 మేర తగ్గిందని పేర్కొంది.
కొత్త నియామకాల కన్నా వలసలు ఎక్కువగా ఉండటం ఇందుకు కారణమని టీసీఎస్ చీఫ్ హ్యుమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మితింద్ లక్కడ్ తెలిపారు. డిసెంబర్ త్రైమాసికంలో కేవలం 7 వేల మందిని మాత్రమే నియమించుకున్నామని పేర్కొన్నారు.
కాగా డిసెంబర్ త్రైమాసికంలో ఐటీ సర్వీసుల అట్రిషన్ రేటు ఏకంగా 21.3 శాతానికి చేరిన విషయం తెలిసిందే. ఇదే గరిష్టమని, రానున్ కాలంలో అట్రిషన్ రేటు తగ్గుతుందని గోపీనాథన్ తెలిపారు
ఆర్థిక మాంద్యం భయాలు దెబ్బకు ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇక స్టార్టప్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ ఉద్యోగుల భర్తీ ప్రకటన చేయడం గమనార్హం. అంటే కంపెనీ వచ్చే ఆర్థిక సంవత్సరంపై చాలా విశ్వాసంతో ఉందని చెప్పుకోవచ్చు. అందుకే భారీగా నియమాకాలు చేపడతామని ప్రకటించింది. దీంతో ఫ్రెషర్లకు మంచి అవకాశం లభించనుంది. కష్టపడితే మంచి జాబ్ తెచ్చుకోవచ్చు. బీటెక్ ఫైనాల్ ఇయర్ స్టూడెంట్స్‌కు మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. దిగ్గజ కంపెనీలు ఐటీ జాబ్ కొట్టొచ్చు.
.jpeg)
Comments
Post a Comment