తెలంగాణ విద్యుత్ శాఖలో 1601 జూనియర్ లైన్‌మ్యాన్ పోస్టులు..
హైదరాబాద్‌లోని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్).. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 1601 జూనియర్ లైన్‌మ్యాన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 8 నుంచి ప్రారంభమవుతాయి. పదో తరగతితోపాటు ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్‌మ్యాన్ స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తుదారుల వయసు ఖచ్చితంగా 18 నుంచి 44 యేళ్ల మధ్య ఉండాలి
- ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో మార్చి 28, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
- జనరల్ కేటగిరీ అభ్యర్ధులు రూ.320లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు.
- రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష ఏప్రిల్ 30న జరుగుతుంది.
- హాల్ టికెట్లు ఏప్రిల్ 24 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- అర్హత సాధించిన వారికి నెలకు రూ.24,340ల నుంచి రూ.39,405ల వరకు జీతంగా చెల్లిస్తారు.
- ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి
కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు
7702052014
ReplyDelete