Budget 2023 Effect: ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి.. ఏవి తగ్గుతాయి?

 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.


 ఒక గంటా 26 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం సాగింది. ఈ బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరటనిస్తూ కొన్న పన్ను విధానాన్ని తీసుకొచ్చారు. రూ.7 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపులు ఇచ్చారు. కీలక రంగాలకు కేటాయింపులు చేశారు. అయితే, కొన్నింటిపై సుంకాలు పెంచడం, కొన్నింటిపై తగ్గించడం వంటి చర్యలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం.. సామాన్యులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి. అలాగే మరికొన్నింటి ధరలు తగ్గనున్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.

                                  


బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..
బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దీంతో గోల్డ్, సిల్వర్, ఆభరణాల ధరలకు రెక్కలు రానున్నాయి. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న ధరలు.. వచ్చే ఆర్థిక ఏడాది మరింత ప్రియం కానున్నాయి. కెమెరా లెన్సులపై కస్టమ్స్ సుంకంపై ఏడాది పాటు మినహాయింపు కల్పించారు. టీవీ విడిభాగాలపై ప్రస్తుతం ఉన్న 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించారు. లిథియం అయాన్ బ్యాటరీలపై అవసరమైన సామగ్రి పైనా కస్టమ్స్ సుంకాన్ని మినహాయించారు






Comments

Post a Comment

Popular posts from this blog

తెలుగు ప్రజల కోసం 25 తెలుగు పేపర్స్ ఒకే చోట

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల