TS Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 10 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
తెలంగాణలో త్వరలోనే 10 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఈ మేరకు ఫిబ్రవరి 10న ప్రకటించారు.
త్వరలోనే 10 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఈ మేరకు అసెంబ్లీలో ఫిబ్రవరి 10న అసెంబ్లీలో ప్రకటించారు. మన ఊరు-మన బడి మొదటిదశ కింద మరమ్మతులు చేపట్టిన 9,123 పాఠశాలలు జూన్ నాటికి సిద్ధమవుతాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థులు లేరని ఎక్కడా పాఠశాలలు మూసివేయడం లేదన్నారు. భాషా పండితులు, ఇతర సమస్యలు కొన్ని కోర్టుల్లో ఉండటంతో పరిష్కారం కాకుండా నిలిచిపోయాయని పేర్కొన్నారు. 317 జీవో కింద ఇతర జిల్లాలకు వెళ్లిన వారికి ప్రస్తుత బదిలీల్లో పాత జిల్లాల్లో పోస్టింగ్‌లకు అవకాశాలు ఉన్నాయన్నారు.
మహబూబాబాద్, కొత్తగూడెంలలో కొత్త ఇంజినీరింగ్ కళాశాలల ప్రారంభానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలుగు, ఆంగ్ల మీడియం విద్యార్థులకు వేర్వేరుగా బోధించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యా వాలంటీర్ల వేతనాలు ట్రెజరీలో నిలిచిపోయి ఉన్నాయని పరిష్కరించాలని అడిగారు.
కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు
కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుపై తేల్చండి..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుపై త్వరగా తేల్చాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి గవర్నర్ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు రాజ్‌భవన్‌లో పెండింగ్ ఉన్నదని, నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని త్వరగా ఆమోదముద్ర వేయాలని కోరారు. పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్య పద్దులపై మంత్రి మాట్లాడారు. నాణ్యమైన విద్య అందినపుడే మానవవనరులు అభివృద్ధి చెందుతాయని, దీన్ని బలంగా నమ్మిన సీఎం కేసీఆర్ కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యనందిస్తున్నట్టు చెప్పారు. ‘మన ఊరు-మనబడి’ రెండోవిడతలో 9,123 ప్రభుత్వ పాఠశాలల్లో రూ.2,516 కోట్లతో పనులు చేపడుతామని పేర్కొంటూ అద్భుతంగా తీర్చిదిద్దిన పలు పాఠశాలల ఫొటోలను మంత్రి సభలో ప్రదర్శించారు. ఏటా 2.10 కోట్ల ఉచిత పుస్తకాలు అందజేస్తున్నామని ఆమె వివరించారు.

Comments
Post a Comment