తెలంగాణ విద్యా శాఖలో విద్యా వాలంటీర్ల రిక్రూట్‌మెంట్

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వాలంటీర్ల నియామకానికి పాఠశాల విద్యా శాఖకు అనుమతి ఇచ్చింది. 



తెలంగాణ రాష్ట్రంలో టీచర్స్ కు(teachers) సంబంధించిన నోటిఫికేషన్ లేక చాలా ఏళ్లవుతుంది. టీచర్ ఉద్యోగుల కోసం ఎంతో మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. 

ఇదే తరుణంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం టీచర్ల పోస్టులు భర్తీ చేయడానికి చాలా సమయం పట్టేట్టు కనిపిస్తోంది. 
ఇదే టైంలో వచ్చే విద్యా సంవత్సరానికి గాను ప్రతి స్కూల్లో టీచర్ల కొరత ఉండకూడదని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందట.. టీచర్లు లేనటువంటి ఖాళీలను గుర్తించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 15వేల విద్య వాలంటర్ల పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం తెలంగాణలో విద్యా వాలంటీర్ల పోస్టులకు సంబంధించి అన్ని పోస్టులను భర్తీ చేయాలని సర్కార్ విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం డీఎస్సీ వేసి ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలంటే కనీసం ఎనిమిది నుంచి పది నెలల సమయం పడుతుంది. 
ఈ క్రమంలో జూన్ 11వ తేదీ నాటికి విద్యా వాలంటీర్లు ఎంపిక పూర్తి చేయాలని , ఉపాధ్యాయులు విధుల్లో చేరేవరకు విద్యా వాలంటీర్లు కొనసాగుతారని తెలియజేసింది.

జీతాలు: ఇంతకుముందు విద్యా వాలంటీర్లకు నెలకు 12 వేల రూపాయల గౌరవ వేతనం అందించేవారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రస్తుతం ఎంపిక చేయబోయే విద్యా వాలంటీర్లకు రూ: 15వేల నుంచి 20వేల మధ్య జీతం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఈ నోటిఫికేషన్ త్వరలో రావాలని కోరుకుందాం 


ముఖ్యమైన లింకులు  

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCOMINING SOON
నోటిఫికేషన్ PDfCOMINING SOON
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

 


Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.