టీఎస్పీఎస్సీ గ్రూప్2 అభ్యర్థులకు పేపర్ 1 పూర్తి సిలబస్

 గ్రూప్2 అభ్యర్థులకు అలర్ట్.. పేపర్ 1 పూర్తి సిలబస్





తెలంగాణలో కొలువుల (Telangana Jobs) పండగ మొదలైంది. 80 వేలకు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ (CM KCR) స్వయంగా అసెంబ్లీ వేదికగా ప్రకటించడంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
చాలా రోజులుగా నోటిఫికేషన్లు (Job Notifications) లేకపోవడంతో నిరాశలో ఉన్న నిరుద్యోగులకు మళ్లీ రాష్ట్రంలో కొలువుల సందడి ప్రారంభం కావడంతో ప్రిపేరషన్ ప్రారంభించారు. అయితే.. పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్న గ్రూప్-2 ఉద్యోగాలకు ఎక్కువగా పోటీ ఉంటుంది. వందల సంఖ్యలో ఉండే ఈ ఉద్యోగాలకు లక్షల సంఖ్యలో పోటీ పడుతూ ఉంటారు. ఈ సారి 582 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ నిన్న ప్రకటించారు. ఇందులో మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్(ACTO), సబ్ రిజిస్టార్ గ్రేడ్-2, డిప్యూటీ తహసీల్దార్ లాంటి అనేక కీలక గెజిటెడ్ జాబ్స్ ఉంటాయి.

గ్రూప్​ 2 పరీక్ష మొత్తం రెండు దశల్లో ఉంటుంది. మొదట రాత పరీక్ష​ ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి పర్సనల్​ ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్షలో​ మొత్తం నాలుగు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ఈ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు.

పేపర్ల వారీగా సబ్జెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి..
పేపర్ I – జనరల్ స్టడీస్ అండ్​ జనరల్ ఎబిలిటీస్
పేపర్ II – చరిత్ర, రాజకీయాలు, సమాజం
పేపర్ III – ఎకనామిక్స్ అండ్ డెవలప్‌మెంట్
పేపర్ IV – తెలంగాణ ఉద్యమం మరియు నిర్మాణం

పేపర్ 1లో ఈ కింది 11 అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
1.కరెంట్ అఫైర్స్(Regional, National & International)
2.ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్
3.జనరల్ సైన్స్India’s Achievements in Science and Technology
4.ఎన్విరాంన్మెంటల్ ఇష్యూస్: Disaster Management – Prevention and Mitigation Strategies
5:వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ
6.హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా
6.హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా
7.సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ
8.తెలంగాణ రాష్ట్ర విధానాలు
9.Social Exclusion, Rights Issues and Inclusive Policies.
10.లాజికల్ రీజనింగ్ Analytical Ability and Data Interpretation
11.బేసిక్ ఇంగ్లిష్ (టెన్త్ స్టాండర్డ్)-

అయితే ఈ పేపర్ లో ఎక్కువ మార్కులు సాధించాలంటే డైలీ న్యూస్ పేపర్లను చదవాలని నిపుణులు, గతంలో జాబ్స్ సాధించిన అభ్యర్థులు చెబుతున్నారు. ప్రతీ రోజు కనీసం రెండు, మూడు ప్రముఖ పేపర్స్ ను చదివి అందులోని ముఖ్యమైన పాయింట్స్ ను నోట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.