రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 602 గురుకులాల్లో ప్రవేశాలు
గురుకులాల్లో ప్రవేశాలు
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల సొసైటీ నిర్వహిస్తున్న పలు గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ( టీజీసెట్ ) 2022 నోటిఫికే షన్ వెలువడింది . దీని ద్వారా సాంఘిక సంక్షేమ , గిరిజన సంక్షేమ , మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తర గతుల సంక్షేమ గురుకులాల్లో అయిదో తరగతిలో అడ్మిషన్స్ ఇస్తారు . కేజీ టు పీజీ మిషన్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ గురు కుల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది .
ప్రత్యేకతలు
• రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 602 గురుకుల పాఠ శాలలు ఉన్నాయి . వీటిలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 230 , గిరిజన సంక్షేమ గురుకులాలు 76 , మహాత్మా జ్యోతి బాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశా లలు 261 , టీఆర్ఆస్ఈఐఎస్ గురుకులాలు ( జనరల్ పాఠశాలలు ) 35 ఉన్నాయి .
• ఈ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యా యులు తరగతులు నిర్వహిస్తారు . ఐఐటీ జేఈఈ , నీట్ , ఎంసెట్ వంటి పోటీ పరీక్ష లకు అవసరమైన శిక్షణ ఇస్తారు . ప్రభుత్వ వైద్య కళాశాలలు , సెంట్రల్ యూనివర్సిటీలు , అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ , ఢిల్లీ యూని వర్సిటీ , టిస్ తదితర ప్రముఖ వర్సిటీల్లో అడ్మిషన్స్ పొందేందుకు ట్రెయినింగ్ ఇస్తారు .
• విద్యార్థుల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు హౌస్ మాస్టర్ / హౌస్ పేరెంట్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది.
• ఫిజికల్ ఎడ్యుకేషన్ , యోగా , క్రీడలకు ప్రాధా నమిస్తారు ..
ప్రవేశ పరీక్ష వివరాలు
దీనిని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు . మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు . తెలుగు నుంచి 20 , ఇంగ్లీష్ నుంచి 25 , మేథ్స్ నుంచి 25 , మెంటల్ ఎబిలిటీ నుంచి 10 , పరిసరాల విజ్ఞానం నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు . ప్రశ్నలను మూడు , నాలుగు తరగతుల పాఠ్యాంశాల నుంచి ఇస్తారు . విద్యార్థులు సమాధానాలను ఓఎంఆర్ పత్రం మీద బ్లూ / బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో గుర్తించాలి . ప్రశ్నపత్రాన్ని తెలుగు , ఆంగ్ల మాధ్య మాల్లో ఇస్తారు . పరీక్ష సమయం రెండు గంటలు
అర్హత
ప్రభుత్వ / గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రస్తుతం నాలుగోతరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు దరఖాస్తు చేసుకో వచ్చు . జనరల్ , బీసీ విద్యార్థులకు తొమ్మిది నుంచి పదకొండేళ్ల మధ్య వయసు ఉండాలి . అంటే 2011 సెప్టెంబరు 1 నుంచి 2013 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి .
● ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు తొమ్మిది నుంచి పదమూ డేళ్ల మధ్య వయసు ఉండాలి . అంటే 2009 సెప్టెంబరు 1 నుంచి 2013 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి .
●కుటుంబ వార్షికాదాయం గ్రామీణ విద్యార్థు లకు రూ .1,50,000 ; పట్టణ విద్యార్థులకు రూ .2,00,000 లు మించకూడదు .
ప్రవేశాలు
●పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారం గానే అడ్మిషన్ ఇస్తారు . రిజర్వేషన్ నిబంధ నలు , స్థానికత , ప్రత్యేక కేటగిరీ తదితరాలను పరిగణనలోకి తీసుకుంటారు .
●విద్యార్థుల ఎంపికలో ' పాత జిల్లా'ను ఒక యూనిట్గా పరిగణిస్తారు . .
●రాష్ట్రానికి చెందిన మత్స్యకార కుటుంబాల పిల్లలందరూ ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఎస్ కౌడిపల్లి పాఠశాలలో ప్రవేశం పొందవచ్చు .
●టీఆర్ఎస్ సర్వేల్ రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ పాఠశాలలో ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన విద్యా ర్డులు పోటీపడవచ్చు .
●ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ విద్యార్థులు సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశం పొందవచ్చు .
• ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 28
•ప్రవేశ పరీక్ష తేదీ : మే 8 న
• వెబ్సైట్ : http://tgcet.cgg.gov.in
Comments
Post a Comment