రూ.96,890 వరకు వేతనంతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు | Telangana High Court Jobs
తెలంగాణ హైకోర్టు పలు జిల్లాల్లో స్టెనోగ్రాఫర్ పోస్టుల్ని (Stenographer Jobs) భర్తీ చేస్తోంది. డిగ్రీ పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు.
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ హైకోర్టు (Telangana High Court) పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది.
మొత్తం ఖాళీలు :- 64
విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. తెలంగాణ ప్రభుత్వ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్, షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ పాస్ కావాలి. కంప్యూటర్ ఆపరేట్ చేయగలిగే క్వాలిఫికేషన్ ఉండాలి.
జిల్లాలవారీగా ఖాళీల వివరాలివే
వయస్సు- 2022 జూలై 1 నాటికి 18 నుంచి 34 ఏళ్లు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.800. ఎస్‌సీ, ఎస్‌టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.400.
ఎంపిక విధానం- ఆన్‌లైన్ బేస్డ్ కంప్యూటర్ ఎగ్జామినేషన్
పోస్టు ద్వారా, కొరియర్ ద్వారా లేదా నేరుగా అభ్యర్థులు సబ్మిట్ చేసే దరఖాస్తుల్ని స్వీకరించరు
పరీక్షా విధానం- కంప్యూటర్ బేస్ట్ ఎగ్జామినేషన్‌లో 50 మార్కులకు ఆబ్జెక్టీవ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి.
స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ 30 మార్కులకు ఉంటుంది. 20 మార్కులకు ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 శాతం, బీసీ అభ్యర్థులు 35 శాతం మార్కులతో పాస్ కావాలి.
దరఖాస్తు ప్రారంభం- 2022 మార్చి 3
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 ఏప్రిల్ 4
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Post a Comment