ఎమ్మెస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ విడుదల | MSC NURSING

 ఎమ్మెస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ విడుదల 
 నర్సింగ్ , ఎంపీటీ కోర్సుల్లో సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు . 
దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో మెరిట్ ఆధారంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు . ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితా వెల్లడించనున్నట్టు వారు పేర్కొన్నారు . ఎమ్మెస్సీ నర్సింగ్ , ఎంపీటీ కోర్సులకు దరఖాస్తు చేసుకొని ప్రొవిజినల్ జాబితాలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 4 న జేఎన్టీయూ కూక ట్పల్లిలో ఏర్పాటుచేసిన కేంద్రానికి ధ్రువప త్రాలతో హాజరుకావాలని కోరారు . 

హోమియోపతి సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ 

ప్రైవేట్ హోమియోపతి కళాశాలల్లో బీహెచ్ ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడుత కౌన్సెలింగ్కు కాళోజీ హెల్త్ యూనివ ర్సిటీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది . దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో అర్హత కలిగిన అభ్యర్థుల జాబితాను వర్సిటీ విడుదల చేసింది . మెరిట్ జాబితాలో అర్హత సాధించిన అభ్యర్థులు 5 వ తేదీన జేఎన్ టీయూ కూకట్పల్లిలో ఏర్పాటుచేసిన ఆన్ లైన్ కౌన్సెలింగ్కు హాజరు కావాలని అధికా రులు తెలిపారు . మరింత సమాచారం కోసం యూనివర్సిటీ 
వెబ్సైట్ www.knruhs.telangana.gov.in లో పరిశీలించవచ్చు .

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.