పీజీ ప్రోగ్రామ్ విశాఖ ఐఐఎంలో
పీజీ ప్రోగ్రామ్ విశాఖ ఐఐఎంలో ..
విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ( ఐఐఎంవీ ) - పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ( పీజీపీ ) లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది . ఇది రెండేళ్ల వ్యవధిగల ఫుల్ టైం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ . ఇందులో ఏడాదికి మూడు టర్మ్లు ఉంటాయి . మొదటి ఏడాది కోర్సు పూర్తయ్యాక సమ్మర్ ఇంటర్న్షిప్ ఉంటుంది .
ప్రోగ్రామ్లో భాగంగా క్లాస్ రూం డిస్కషన్స్ , గెస్ట్ లెక్చర్స్ , కేస్ స్టడీస్ , గ్రూప్ ప్రాజెక్టులు , టర్మ్ పేపర్స్ , బిజినెస్ గేమ్స్ ఉంటాయి .
అకడమిక్ ప్రతిభ , క్యాట్ 2021 స్కోర్ , అనుభవం , పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు .
అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి .
క్యాట్ 2021 అర్హత తప్పనిసరి .
దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 15
దరఖాస్తులో కరెక్షన్స్ : మార్చి 24 నుంచి 31 వరకు
• పర్సనల్ ఇంటర్వ్యూలు : ఏప్రిల్ 11 నుంచి మే 11 వరకు
• ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ : జూన్ 24
• ప్రోగ్రామ్ ప్రారంభం : జూలై 4 నుంచి
వెబ్సైట్ : iimv.ac.in
Comments
Post a Comment