ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ డిజైన్ ( ఏఐఎ ఫ్డీ ) - బీఎస్సీ ప్రోగ్రామ్లో ప్రవేశానికి నోటిఫికేషన్

ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యు కేషన్ సొసైటీ నిర్వహిస్తున్న ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ డిజైన్ ( ఏఐఎ ఫ్డీ ) - బీఎస్సీ ప్రోగ్రామ్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది . ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు . ఇందులో ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి . 


ఫ్యాషన్ అండ్ అప్పారెల్ డిజైన్ , ఇంటీరియర్ డిజైన్ అండ్ డెకరేషన్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి . ఒక్కోదానిలో 60 సీట్లు ఉన్నాయి . ఈ ప్రోగ్రామ్ని ఆర్మీ విభాగాలకు చెందిన ఉద్యోగులు / విశ్రాంత ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేకించారు . 
ఆన్లైన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు . 

అర్హత : గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదేని గ్రూప్తో ఇంటర్ / పన్నెండోతరగతి / తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి . 
తల్లిదండ్రుల్లో ఒకరికి ఆర్మీ ఉద్యోగిగా కనీసం పదేళ్ల సర్వీస్ ఉండాలి . 
ఆన్లైన్ అడ్మిషన్ టెస్ట్ వివరాలు : దీనిని మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు . ఇందులో ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టెస్ట్ , జనరల్ అవేర్నెస్ టెస్ట్ , ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ అండ్ కాంప్రహెన్షన్ టెస్ట్ ఉంటాయి . ప్రశ్నపత్రాన్ని ఆంగ్ల మాధ్యమంలో ఇస్తారు . నెగె టివ్ మార్కులు లేవు . పరీక్ష సమయం మూడు గంటలు . 
ముఖ్య సమాచారం దరఖాస్తు ఫీజు : రూ .1,000 
దరఖాస్తుకు చివరి తేదీ : మే 5 
అడ్మిట్ కార్డుల పంపిణీ : మే 27 న 
ఆన్లైన్ అడ్మిషన్ టెస్ట్ తేదీ : మే 29 
ఫలితాలు విడుదల : జూన్ 10 న  
అడ్మిషన్ పొందిన అభ్యర్థుల లిస్ట్ విడుదల : జూన్ 20 న 
తరగతులు ప్రారంభం : జూలై 11 నుంచి 
వెబ్సైట్ : aifd.edu.in

                  https://aifd.cbtexam.in/Home/ListofExam.aspx
  



Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.