RBI Recruitment | హైదరాబాద్‌లోని ఆర్‌బీఐలో జాబ్స్

 బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మొత్తం 950 అసిస్టెంట్ పోస్టుల (RBI Assistant Jobs) భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.



హైదరాబాద్‌లో 40 ఖాళీలను భర్తీ చేస్తోంది ఆర్‌బీఐ. డిగ్రీ పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి.


అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ 50% మార్కులతో పాస్ కావాలి. 

అభ్యర్థుల వయస్సు 2022 ఫిబ్రవరి 1 నాటికి 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక  :ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ద్వారా చేస్తారు. లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ స్థానిక భాషలో ఉంటుంది. హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ కార్యాలయంలో ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులకు తెలుగులో లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ ఉంటుంది. 

వేతనం :- ఎంపికైనవారికి రూ.20,700 బేసిక్ తో మొత్తం రూ.55,700  లభిస్తుంది.

దరఖాస్తు చివరి తేదీ  2022 మార్చి 8 

ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా https://opportunities.rbi.org.in/
వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. Vacancies సెక్షన్‌లో Assistant Recruitment నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. నియమనిబంధనలన్నీ పూర్తిగా చదవాలి. Recruitment for the post of Assistant - 2021 లింక్ పైన క్లిక్ చేయాలి   ఇక్కడ క్లిక్  చేయండి 

 కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Click here for New Registration పైన క్లిక్ చేయాలి.

 మొత్తం 6 దశల్లో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. 

మొదటి దశలో పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి. 

రెండో దశలో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. 

మూడో దశలో విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

నాలుగో దశలో అప్లికేషన్ ప్రివ్యూ చూసి వివరాలన్నీ సరిచూసుకోవాలి. 

ఐదో దశలో ఇతర సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి. 

ఆరో దశలో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.450, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు రూ.50 ఫీజు పేమెంట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి

అభ్యర్థులు ఫీజ్ పేమెంట్, దరఖాస్తు సబ్మిషన్ 2022 మార్చి 8 లోగా పూర్తి చేయాలి. దరఖాస్తులో తప్పులు సరిదిద్దుకోవడానికి కూడా 2022 మార్చి 8 చివరి తేదీ. 2022 మార్చి 23 వరకు దరఖాస్తు ప్రింట్ తీసుకోవచ్చు. 2022 మార్చి 26, 27 తేదీల్లో ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్, 2022 మేలో మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది

https://ibpsonline.ibps.in/rbiafeb22/basic_details.php

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.