TCS MBA Hiring 2022 | ఎంబీఏ చదువుతున్నవారికి, ఎంబీఏ పాసైనవారికి టీసీఎస్ ఆఫర్స్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో (TCS) ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. ఎంబీఏ చదువుతున్నవారికి, ఎంబీఏ పాసైనవారికి జాబ్ ఆఫర్స్ ఇస్తోంది టీసీఎస్. టీసీఎస్ ఎంబీఐ హైరింగ్ ప్రోగ్రామ్ వివరాలు తెలుసుకోండి.
దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు కోరుకుంటున్న నిరుద్యోగులకు అలర్ట్. ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవల కాలంలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఫ్రెషర్స్‌ని ఎక్కువగా నియమించుకుంటోంది. అందుకోసం వేర్వేరు ప్రోగ్రామ్స్ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆఫ్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్ 2022, స్మార్ట్ హైరింగ్ 2022, ఎంబీఏ హైరింగ్ 2022 లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా నియామకాలు చేపట్టింది. ఇప్పుడు మరోసారి టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ 2022 ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఎంబీఏ చదువుతున్నవారితో పాటు ఎంబీఏ పాసైనవారు అప్లై చేయొచ్చు. గతంలో ఈ ప్రోగ్రామ్‌కు చివరి తేదీ ఉండేది. కానీ ప్రస్తుతం ప్రకటించిన టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ 2022 ప్రోగ్రామ్‌కు చివరి తేదీ లేదు. అయితే దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు.
టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ ప్రోగ్రామ్ గతేడాది ప్రారంభమైంది. విడతలవారీగా టీసీఎస్ దరఖాస్తుల్ని స్వీకరించింది. 2021 నవంబర్ 21 నుంచి టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ టెస్ట్స్ జరుగుతున్నాయి. ఈ టెస్టులు బ్యాచ్‌ల వారీగా కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు టెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తుంది టీసీఎస్. రాబోయే ఆర్థిక సంవత్సరం అంటే 2022-23 కోసం టీసీఎస్ ఈ నియామకాలు చేపడుతుంది.
టెస్ట్ తేదీ- బ్యాచ్‌లవారీగా పరీక్ష నిర్వహిస్తోంది టీసీఎస్. రిజిస్ట్రేషన్ పూర్తైనవారికి పరీక్ష సమాచారాన్ని అందిస్తుంది.
ఇంటర్వ్యూ తేదీ- త్వరలో ప్రకటించనున్న టీసీఎస్
విద్యార్హతలు- 2022, 2021 లో ఎంబీఏ పాస్ అయినవారు దరఖాస్తు చేయాలి. 2022 లో ఎంబీఏ పాస్ అయ్యేవారు అంటే చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేయొచ్చు. మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, జనరల్ మేనేజ్‌మెంట్, బిజినెస్ అనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ లాంటి విభాగాల్లో రెండేళ్ల మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అనలిటిక్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ పాస్ కావాలి.
వయస్సు- 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల లోపు
టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టీసీఎస్ ఎంబీఏ హైరింగ్‌కు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయండి ఇలా
Step 1- టీసీఎస్ ఎంబీఐ హైరింగ్ ప్రోగ్రామ్‌కు అప్లై చేయడానికి https://www.tcs.com/careers/management-hiring-yop-2020-2022 లింక్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో వివరాలన్నీ చదివిన తర్వాత TCS Next Step Portal లింక్ పైన క్లిక్ చేయాలి.
Step 3- ఆ తర్వాత Register Now పైన క్లిక్ చేయాలి.
Step 4- ఆ తర్వాత IT పైన క్లిక్ చేయాలి.
Step 5- అభ్యర్థి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 6- ముందే రిజిస్ట్రేషన్ చేసినవారు నేరుగా లాగిన్ చేసి దరఖాస్తు చేయొచ్చు.
Step 7- మోడ్ ఆఫ్ టెస్ట్ రిమోట్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
Step 8- వివరాలన్నీ సరిచూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
Step 9- అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి Track Your Application పైన క్లిక్ చేయాలి.
Step 10- Applied for Drive అని స్టేటస్ కనిపిస్తే దరఖాస్తు ప్రక్రియ విజయవంతం అయిందని అర్థం చేసుకోవాలి.
Comments
Post a Comment