Posts

Showing posts from September, 2022

టెక్ మహీంద్రాలొ ఉద్యోగాలు

Image
Hiring for Customer support ( Domestic Voice) Eligibility : Domestic Calling Experience (6 months Or more) CTC up to 2.2Lacs Work from Office Location: Hyderabad (Hi-tech city) Address:- Tech Mahindra ltd Hitech City SEZ gate-1, opposite Ananth building. No Cab Facility Must be Covid vaccinated with 2 doses Flexible for Day Shifts ONLY. APPLY LINK: 👇 Interested candidates kindly drop Your Resumes ( CH. LAKSHMINARAYANA SARMA, HR)   Email id :-   cn00878499@techmahindra.com

టెన్త్ అర్హతతో ఇండియా పోస్ట్‌లో జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

Image
ఇండియా పోస్ట్‌ లో (India Post) ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు సువర్ణావకాశం ఉంది. తాజాగా ఇండియా పోస్ట్ లో పలు  ఉద్యోగాల  (Jobs) భర్తీకి అధికారులు  నోటిఫికేషన్  (Indian Post Job Notification) విడుదల చేశారు. బెంగళూరు సర్కిల్‌లోని మోటార్ మెయిల్ సర్వీస్ కింద డ్రైవర్ పోస్టుల భర్తీకి అధికారులు ప్రకటన విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులను  indiapost.gov.in  వెబ్‌సైట్‌ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 26ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.19 వేల వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థులకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్‌ ఉండాలి. తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ ను  https://www.indiapost.gov.in/VAS...

స్టేట్ బ్యాంక్ ఇండియా (State Bank Of India) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. 1673 పీఓ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Image
  దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  భారీగా ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు  నోటిఫికేషన్  (SBI PO Notification) విడుదల చేసింది. మొత్తం 1673 పీఓ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్ సైట్లో ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు గాను ఇందులో రెగ్యులర్ పోస్టులు 1600 ఉండగా.. బ్యాక్‌లాగ్ పోస్టులు మరో 73 వరకు ఉన్నాయి ఎస్సీ 270 ఎస్టీ 131 ఓబీసీ 464 ఈడబ్ల్యూఎస్‌ 160 యూఆర్‌ 648 మొత్తం:  1643 విద్యార్హతలు: ఈ ఉద్యోగాలకు విద్యార్హతను డిగ్రీగా నిర్ణయించారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి డిగ్రీ విద్యార్హత పొందిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయస్సు ఏప్రిల్ 1, 2022 నాటికి 21-30 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ముఖ్యమైన తేదీలు: ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప...

ఉచితంగా గ్రూప్ 3 , గ్రూప్ 4 కోచింగ్

Image
ఉచితంగా గ్రూప్ 3 , గ్రూప్ 4  కోచింగ్ గ్రూప్ 3 , గ్రూప్ 4 పై ఉచిత కోచింగు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి ఈ నెల 17 వరకు దరఖాస్తులను స్వీకరిస్తు న్నట్టు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ తెలిపారు .  రాష్ట్రవ్యాప్తంగా 50 బీసీ స్టడీ సెంటర్లలో ఈ నెల 15 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు . వివరాలకు www.tsbcstudycircle.cgg.gov.in సంప్రదించాలని సూచించారు .

ఈ వారం అప్లై చేసుకోవాల్సిన జాబ్స్ ఇవే..!

Image
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు చెందిన వివిధ సంస్థలు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టాయి. వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయి. వీటిలో కొన్ని * టీఎస్‌పీఎస్సీ రిక్రూట్‌మెంట్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్లు, అసోసియేట్- అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు tspsc.gov.in వెబ్‌సైట్ ద్వారా సెప్టెంబర్ 27లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  ఈ రిక్రూట్‌‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తంగా 27 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.57,700 వరకు జీతం లభించనుంది.  * ఏఏఐ(AAI) రిక్రూట్‌మెంట్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. కేవలం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్ దీవులకు చెందిన వారు మాత్రమే దరఖా...

తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్.. పోస్టులు, అర్హత వివరాలిలా..

Image
  తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. వరుసగా ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వస్తున్నాయి. అదే విధంగా టీఎస్పీఎస్సీ( TSPSC ) నుంచి కూడా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా మరో నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ నుంచి విడుదల అయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. గత వారం రోజుల నుంచి 3 నోటిఫికేషన్లను( Notifications ) విడుదల చేశారు. తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో 833 ఇంజినీరింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. అంతే కాకుండా.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి పోస్టులను కూడా టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. తాజాగా  అసిస్టెంట్‌ ఇంజినీర్‌, మున్సిపల్‌ అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టులు, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ...

టీఎస్‌పీఎస్‌సీ నుంచి మరో నోటిఫికేషన్... 833 ఖాళీలు

Image
టీఎస్‌పీఎస్‌సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వచ్చేసింది. ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో 833 ఖాళీలు ఉన్నాయి. 2022 సెప్టెంబర్ 28న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది.  ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ ఇంజనీర్, మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 833 ఖాళీలు ఉన్నాయి . ఈ పోస్టులకు 2022 సెప్టెంబర్ 28న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 21 చివరి తేదీ. డీటెయిల్డ్ నోటిఫికేషన్ 2022 సెప్టెంబర్ 23న విడుదల కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాలను టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in లో తెలుసుకోవచ్చు.

ఎస్సై, కానిస్టేబుల్ అర్హత మార్కులు తగ్గింపు.. కేసీఆర్ కీలక నిర్ణయం..

Image
  కానిస్టేబుల్(Constable), ఎస్సై(Sub Inspector) అర్హత మార్కులను తగ్గిస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.  కానిస్టేబుల్, ఎస్సై  ప్రిలిమ్స్ పరీక్షల అర్హత మార్కుల్లో ఎస్సీ, ఎస్టీ కటాఫ్ మార్కులను తగ్గిస్తామని ప్రకటించారు. గత కొన్ని రోజుల నుంచి ఎస్సీ, ఎస్టీ లతో పాటు బీసీ అభ్యర్థులు రిజర్వేషన్ల( Reservations ) విషయంలో అన్యాయం జరిగిందంటూ ఆందోళనలను చేపడతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులను(Cut Off Marks) తగ్గించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీశాఖలో 614 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు  తెలంగాణ  స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నియామకాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ను ఈ నెల 28వ తేదీన నిర్వహించారు. తర్వాత ఐదు రోజులకు ప్రిలిమనరీ కీను కూడా విడుదల చేశారు. అయితే దీనిలో 5 ప్రశ్నలకు సంబంధించి సమాధానలను తప్పులుగా ఉన్నట్లు కీలో పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలను స్వీకరించిన బోర్డు తుది ఫలితాలను వెల్లడించలేదు. ఈ లోపే తమకు అన్యాయం జరిగిందంటూ ఎస్సీ, ఎస్ట...

రాత పరీక్షలేకుండా.. మహబూబాబాద్‌ జిల్లా ప్రభుత్వ దవాఖానాల్లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు

Image
  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ హెల్త్‌ మిషన్ కింద మహబూబాబాద్‌ జిల్లా (Mahbubabad District)లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. ఒప్పంద ప్రాతిపదికన 50 మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల (Mid level health provider Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఏఎంస్‌/బీఎస్సీ నర్సింగ్‌/స్టాఫ్‌నర్స్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 యేళ్ల మధ్య ఉండాలి.   ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు 5,  దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది.  ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆఫ్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 17, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవచ్చు.  దరఖాస్తు రుసుము జనరల్ అభ్యర్ధులకు రూ.300లు,  ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్ధులకు రూ.250లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంట...