టీఎస్‌పీఎస్‌సీ నుంచి మరో నోటిఫికేషన్... 833 ఖాళీలు
టీఎస్‌పీఎస్‌సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వచ్చేసింది. ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో 833 ఖాళీలు ఉన్నాయి. 2022 సెప్టెంబర్ 28న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది.
ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ ఇంజనీర్, మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 833 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు 2022 సెప్టెంబర్ 28న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 21 చివరి తేదీ. డీటెయిల్డ్ నోటిఫికేషన్ 2022 సెప్టెంబర్ 23న విడుదల కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాలను టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in లో తెలుసుకోవచ్చు.
Comments
Post a Comment