ఈ వారం అప్లై చేసుకోవాల్సిన జాబ్స్ ఇవే..!

కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు చెందిన వివిధ సంస్థలు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టాయి. వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయి. వీటిలో కొన్ని


* టీఎస్‌పీఎస్సీ రిక్రూట్‌మెంట్

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్లు, అసోసియేట్- అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు tspsc.gov.in వెబ్‌సైట్ ద్వారా సెప్టెంబర్ 27లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

ఈ రిక్రూట్‌‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తంగా 27 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.57,700 వరకు జీతం లభించనుంది. 

* ఏఏఐ(AAI) రిక్రూట్‌మెంట్
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. కేవలం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్ దీవులకు చెందిన వారు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి. నెల జీతం లొకేషన్ ఆధారంగా రూ. 31,000 నుంచి రూ.1,10,000 మధ్య ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలి.

* ఇండియన్ కోస్ట్ గార్డ్
వివిధ నావిక్, యాంత్రిక్ పోస్టుల భర్తీకి ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 22లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తంగా 300 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఇతర అలవెన్సులతో కలిపి నెలకు రూ.29,200 వరకు జీతం లభిస్తుంది.

* ఎస్‌బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 665 పోస్టులను భర్తీ చేయనున్నారు.  ఈ జాబ్ రోల్ ఐదు సంవత్సరాల కాంట్రాక్ట్ వ్యవధిపై ఆధారపడి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 20లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000 వరకు జీతం లభిస్తుంది. 

నాబార్డ్ రిక్రూట్‌మెంట్
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) డెవలప్‌మెంట్ అసిస్టెంట్, డెవలప్‌మెంట్ అసిస్టెంట్ (హిందీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తంగా 177 పోస్టులను భర్తీ చేయనుంది.ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.13,150 నుంచి రూ. 34,990 మధ్య వేతనం లభిస్తుంది. అప్లికేషన్ ఫారమ్స్ సెప్టెంబర్ 15 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 10లోపు అప్లై చేసుకోవచ్చు.

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్