తెలంగాణ నిరుద్యోగలకు అలర్ట్.. ఆ 10 వేల ఉద్యోగ నోటిఫికేషన్లకు బ్రేక్..

 తెలంగాణలో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే 20 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఇందులో పోలీస్ ఉద్యోగాలే అత్యధికంగా ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ సైతం ఇప్పటికే పూర్తి కాగా.. ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. 



ఇంకా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ ను సైతం టీఎస్పీఎస్సీ విడుదల చేయగా.. ఈ నెల 16న ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. తెలంగాణలో వైద్య రంగం బలోపేతానికి కృషి చేస్తోన్న కేసీఆర్ సర్కార్ ఆ రంగంలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

ఈ నేపథ్యంలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (MHSRB) ద్వారా 10,028 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో ఎంబీబీఎస్ అర్హతతో 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోంది

ఇంకా పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ పరిధిలో 751 సివిల్ సర్జన్, వైద్య విధాన పరిషత్ పరిధిలో 211 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఇనిస్ట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM) లో 7 ఖాళీల భర్తీకి ఏర్పాట్లు సాగుతున్నాయి. 

వచ్చే వారం ఇందుకు సంబంధించిన అర్హుల జాబితాను విడుదల చేయనున్నారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత వచ్చే వారం ఫైనల్ లిస్ట్ విడుదల చేయనున్నారు అధికారులు. అయితే.. ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్ల పెంపుపై జీఓ విడుదలకు ముందే ఈ నోటిఫికేషన్ విడుదలైనందున ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ యథాతదంగా కొనసాగనుంది.

కాగా.. మరో 9 వేల ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. అయితే.. గిరిజన రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో నోటిఫికేషన్ల విడుదలను అధికారులు వాయిదా వేశారు

కొత్త రిజర్వేషన్లకు సంబంధించిన రోస్టర్ వివరాలను అందిన తర్వాతనే ఇందుకు సంబంధించిన 9 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లకు విడతల వారీగా నోటిఫికేషన్లను విడుదల చేస్తామని వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. కొత్త గిరిజన రిజర్వేషన్ల ప్రకారం ఆయా వర్గాలకు 900 ఉద్యోగాలు దక్కనున్నాయి

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.