సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి... ఖాళీలు 110
బ్యాంక్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రాత పరీక్ష లేకుండానే వివిధ పోస్టుల భర్తీకి ఈ బ్యాంకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో స్పెషల్ కేటగిరీ పోస్టులను భర్తీ..
దీని ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో స్పెషల్ కేటగిరీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు అనుభవజ్ఞులైన, ప్రొఫెషనల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 17.2022. కాగా, ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ Centralbankofindia.co.in ద్వారా అప్లై చేయవచ్చు.
* అప్లికేషన్ ప్రాసెస్
* అప్లికేషన్ ఫీజు..
ఈ పోస్టులకు అప్లై చేసుకునే SC, ST, PWBD అభ్యర్థులు రూ.175 + జీఎస్టీ(GST) చెల్లించాలి. ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.850 + జీఎస్టీ(GST)గా ఉంది.
అభ్యర్థుల ఫైనల్ సెలక్షన్ వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆయా కేటగిరీలలోని ఖాళీలను బట్టి ఎనిమిది రెట్లు ఎక్కువగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వారిని ఇంటర్వ్యూ చేసి ప్రతిభ కలిగిన వారిని సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూకు సెలక్ట్ కావడానికి అర్హత ఒక్కటే సరిపోదు. అనుభవం, ఇతర అంశాలు కూడా కీ రోల్ ప్లే చేస్తాయి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ - 28 సెప్టెంబర్ 2022
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ - 17 అక్టోబర్ 2022
ఇంటర్వ్యూ - డిసెంబర్ 2022
ఇంటర్వ్యూ అడ్మిట్ కార్డ్ విడుదల - నవంబర్ 2022
Comments
Post a Comment