46 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సర్కార్ ఆమోదం.. ఆ రాష్ట్ర యువతకు అదిరిపోయే శుభవార్త..
ఒకే సారి 46 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
మొత్తం 46,500 ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి గెహ్లాట్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు లెవల్-1, లెవల్-2, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను నియమించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది
ఇటీవల బడ్జెట్ ప్రకటన సందర్భంగా 75000 ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే ఇందుకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టింది ప్రభుత్వం. ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నియామకాలపై భారీగా దృష్టి సారించాయి.
దేశంలో నిరుద్యోగ రేటు భారీగా పెరగడంతో యువత నుంచి వస్తున్న వ్యతిరేఖత నేపథ్యంలో ఈ నియామకాలను చేపట్టాయి ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో తెలంగాణలోకి కేసీఆర్ సర్కార్ సైతం 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
Comments
Post a Comment