ఖరగ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - PHD
ఖరగ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - పీహెడి ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
రెగ్యులర్, స్పాన్సర్డ్, ఎగ్జిక్యూటివ్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. అకడమిక్ మెరిట్, రిటెన్ టెస్ట్, ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. ప్రోగ్రామ్లో భాగంగా కోర్సు వర్క్స్ లు, రిసెర్చ్ వర్క్, సెమినార్లు, కాన్ఫరెన్స్లు, కాంప్ర హెన్సివ్ ఎగ్జామినేషన్, వైవా, పబ్లికేషన్ ఆఫ్ రిసెర్చ్ వర్క్, అవార్డ్ ఆఫ్ పేటెంట్స్, టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ తదితరాలు ఉంటాయి.
రెగ్యులర్ ప్రోగ్రా మ్ లో చేరిన అభ్యర్థులకు ఇన్ స్టిట్యూట్ అసిస్టెంటిషిప్ లేదా సీఎస్ఐఆర్/ యూజీసీ/ డీబీటీ/ ఐసీఎంఆర్/ ఇన్ స్పయిర్ ఫెలోషిప్ వర్తిస్తాయి.
ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు. గరిష్ఠంగా ఎనిమిదేళ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది.
విభాగాలు: ఇంజనీరింగ్, టెక్నాలజీ సైన్స్, ఆర్కిటెక్చర్ అండ్ రీజనల్ | ప్లానింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, రూరల్ డెవలప్మెంట్, లా మేనేజ్మెంట్, మెడిసిన్.
అర్హత: విభాగాన్ని అనుసరించి ఎంఈ/ఎంటెక్/ ఎంఆర్క్/ ఎంఎస్/ ఎమ్మెస్సీ(ఇంజనీరింగ్)/ ఎంసీపీ/ ఎంఆ ర్పే/ ఎంబీఏ/ పీజీడీఎం/ ఎల్ఎల్ఎం ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు పీజీ స్థాయిలో ఇంజనీరింగ్, సైన్స్, కామర్స్, మేనేజ్మెంట్, లా విభాగాలకు కనీసం 60 శాతం మార్కులు; హ్యుమానిటీస్, సోషల్ సైన్స్ విభాగాలు సహా ఎంబీబీ ఎస్ అభ్యర్థులకు కనీసం 55 శాతం మార్కులు ఉండాలి. బీఈ/ బీటెక్/ | బీఆర్క్/ బీఎస్సీ ఇంజనీరింగ్/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు గేట్ వ్యాలిడ్ స్కోర్/ నెట్ అర్హత ఉన్నవారు కూడా అర్హులే. స్పాన్సర్డ్ అభ్యర్థులు, వర్కింగ్ ప్రొఫెష నల్స్కు కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. ఐఐటీల నుంచి కనీసం 8 సీజీపీఏ స్కోర్తో బీఈ/ బీటెక్/ డ్యూయెల్ డిగ్రీ పూర్తిచేసినవారికి
నేరుగా అడ్మిషన్ ఇస్తారు. ముఖ్య సమాచారం
ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు రూ.1000, మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500
దరఖాస్తు: ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 11
రిటెన్ టెస్ట్, ఇంటర్వ్యూలు: నవంబరు 14 నుంచి 21 వరకు
' అడ్మిషన్స్: డిసెంబరు 30
» వెబ్సైట్: www.iitkgp.ac.in
Comments
Post a Comment