విద్యాశాఖలో 134 కొలువులు

విద్యాశాఖలో 134 కొలువుల భర్తీ

టీఎస్పీఎస్సీకి ఆర్థికశాఖ అనుమతి

డైట్, బీఈడీ కళాశాలలు, ఎస్సీఈఆర్టీలకు రానున్న అధ్యాపకులు


పాఠశాల విద్యా శాఖ పరిధిలో 134 ఉద్యోగాలను టీఎస్పీ ఎస్సీ ద్వారా ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. అందులో 24 ఉప విద్యా శాఖ అధికారులు, మరో 110 అధ్యాపక, సీని యర్ అధ్యాపక ఖాళీలున్నాయి. ప్రత్యక్ష నియామకం (డైరెక్ట్ రిక్రూట్మెంట్) ద్వారా 33 శాతం కింద ఖాళీలను భర్తీ చేసేందుకు అను మతి కోరుతూ మే 12న విద్యాశాఖ ప్రభుత్వా నికి ప్రతిపాదన పంపింది. కచ్చితంగా ఆర్నె లకు ఆర్థికశాఖ అనుమతి ఇస్తూ శనివారం జీఓ 165ను జారీ చేసింది.
రాష్ట్రంలో మొత్తం 72 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులుండగా అందులో 33 శాతం కింద 24 ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 'ఉద్యోగ ఆశా వహులకు ఇది శుభవార్త' అని ఆర్థికశాఖ మంత్రి హరీ శ్రావు ట్విటర్ ద్వారా పేర్కొన్నారు.
బోధన కళాశాలలకు ఊరట

రాష్ట్రంలో 12 డైట్ కళాశాలలు(డీఈడీ కోర్సు)తో పాటు వరంగల్, మహబూబ్ నగర్, నాగార్జునసాగర్ లోని మూడు ప్రభుత్వ బీఈడీ కళాశాలలు (కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్-సీటీఈ), హైదరాబాద్లోని ఇన్స్టి ట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్(ప్రభుత్వ ఎంఈడీ కళాశాల)లో వందల సంఖ్యలో అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో 33 శాతాన్ని మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్(నోటిఫికేషన్) ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 67 శాతం ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ నిబంధనల కేసు తేలకపోవడంతో పదో న్నతుల ప్రక్రియ గత దశాబ్దన్నర కాలంగా నిలిచిపో యింది. ఇప్పుడు 33 శాతం ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపడంతో కళాశాలలకు కొంత ఊరట కలగనుంది..

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.