టాపిక్ పేరు:: ప్రజా ఉద్యమాలు-నిరసనలు
( టాపిక్ పేరు:: ప్రజా ఉద్యమాలు-నిరసనలు )
వివరణ GK ప్రశ్నల కింద ఉంటుంది
1.తెలంగాణ వైద్య ఆరోగ్య జేఏసి సమ్మేలోకి వస్తున్నట్లు ఎప్పుడు ప్రకటించింది?
1.2011 సెప్టెంబర్ 21
2.2011 ఆగస్ట్ 18
3.2011 జూలై 26
4.2011 సెప్టెంబర్ 25
జవాబు::1
2.సకల జనుల సమ్మెకు మద్ధతుగా ఖమ్మంలో ఏ పార్టీ ఆద్వర్యంలో “పోరు గర్జన “సభ జరిగింది?
1.టీఆర్ఎస్
2.బిజెపి
3.న్యూ డెమోక్రసీ
4.కాంగ్రెస్
జవాబు::3
3.డిల్లీలో జేఏసి ఆద్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఎప్పుడు జరిగింది?
1.2011 సెప్టెంబర్ 22
2.2011 సెప్టెంబర్ 14
3.2011 అక్టోబర్ 2
4.2011 సెప్టెంబర్ 25
జవాబు::4
4.తెలంగాణపై కేంద్రం నాంచుడు దొరణిని నిరసిస్తూ రాజకీయ జేఏసి భాగస్వామ్య పక్షలు డిల్లీలోని ఎక్కడ మౌన దీక్షను
చేపట్టారు?
1.జంతర్ మంతర్
2.పార్లమెంట్
3.రాజ్ ఘాట్
4.ఇండియా గెట్
జవాబు::3
5.సకల జనుల సమ్మెకు మద్ధతుగా హైకోర్టులోని తెలంగాణ ఉద్యోగులు ఏ రోజున విధులు బహిష్కరించారు?
1.2011 అక్టోబర్ 17
2.2011 అక్టోబర్ 23
3.2011 అక్టోబర్ 15
4.2010 అక్టోబర్ 17
జవాబు::1
6.ప్రత్యేక రాష్ట్ర సాదన కోసం సెప్టెంబర్ 30,2012 నాడు హైదారాబాద్ లో “తెలంగాణ మార్చ్ “కు పిలుపు నిచ్చింది?
1.న్యూ డెమోక్రసీ
2.బిజెపి
3.టీఆర్ఎస్
4.రాజకీయ జేఏసి
జవాబు::4
7.తెలంగాణ మార్చ్ కు గల మరొక పేరు ఏది?
1.సంసద్ యాత్ర
2.సాగర హారం
3.మిలియన్ మార్చ్
4.సహాయ నిరాకరణ
జవాబు::2
8.2013 ఏప్రిల్ 29న తెలంగాణ సత్యాగ్రహ దీక్షను ప్రారంబించినది ఎవరు?
1.సుమిత్ చక్రవర్తి
2.ప్రకాష్ జవడేకర్
3.ప్రొ”కోదండరాం
4.కెసిఆర్
జవాబు::1
9.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్ లో పెట్టాలనే డిమాండ్ తో తెలంగాణ రాజకీయ జేఏసి ఎప్పుడు “ఛలో
అసెంబ్లీ “కి పిలుపునిచ్చింది?
1.2012 జూన్ 14
2.2013 జూలై 18
3.2013 ఆగస్ట్ 11
4.2013 జూన్ 14
జవాబు::4
10.12మంది స్వాతంత్ర సమరయోదులతో కలిసి నవంబర్ 01 నుంచి 07 వరకు డిల్లీలోని నిరాహార దీక్షా చేసినది
ఎవరు?
1.ప్రొ’జయశంకర్
2.కొండా లక్ష్మణ్ బాపూజీ
3.ప్రొ’కోదండరాం
4.కెసిఆర్
జవాబు::2
మలిదశ తెలంగాణ ఉద్యమంలో రాజకీయ జేఏసి ఏర్పడిన తరువాత నిర్వహించిన తొలి ఆందోళన కార్యక్రమం సహాయ నిరాకరణ.భారత జాతీయోద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గాంధీ చేసిన సహాయ నిరాకరణ ఉద్యమ స్పూర్తితో తెలంగాణ రాజకీయ జేఏసి తెలంగాణ ఆకాంక్షను కేంద్రానికి తెలియజేయ డానికి ఈ ఆందోళన కార్యక్రమాన్ని తీసుకుంది.కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి సహాయం చేయకుండా ముక్యంగా ఉద్యోగులు ఎలాంటి విధులు నిర్వర్తించకుండా పాలనను స్తంబింపజేయడం ద్వారా ప్రభుత్వాలను నిస్సహాయులుగా మార్చే పోరాట పద్ధతే సహాయ నిరాకరణ ఉద్యమం.శాంతియుత ఉద్యమాలతో మాత్రమే తెలంగాణాను సాదించుకోవచ్చు అని భావించిన తెలంగాణ రాజకీయ జేఏసి వెంటనే తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో పెట్టాలనే డిమాండ్ తో సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చింది .ఈ ఉద్యమంలో ప్రధాన భాగస్వాములు ఉద్యోగులు అయినప్పటికి వివిధ రాజకీయ పార్టీలు ,విద్యార్తులు ,న్యాయవాదులు ఇతర ప్రజా సంఘాలు కూడా తమ వంతు పాత్రను పోషించినవి.
Comments
Post a Comment