పిల్లలని కనే గుడ్డి చేపలు !
హిందూ మహాసముద్రంలోని లోతు జలాల్లో పాన్ కేక్ సీ ఆర్చిన్లు, కళ్లు లేని ఈల్ ఫిష్ గబ్బిలాల ఆకారంలో ఉండే చేపలు.. లాంటి పలు వింత జలచరాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. మ్యూజియమ్స్ విక్టోరియా పరిశో ధన సంస్థకు చెందిన కొంతమంది శాస్త్రవేత్తల బృందం ఆస్ట్రేలియాలోని కొకోస్ దీవి మెరైన్ పార్కులోని సముద్రపు అట్టడుగు భాగంలో వీటి గురించి వివరంగా పరిశోధించారు. హిందూ మహాసముద్రంలో ఇంతకుముందు ఎప్పుడూ గమనించని సముద్రపు లోతుల్లో ఉండే జీవజాలం గురించి కూడా తాము పరిశోధించినట్లు ఆస్ట్రేలియా పరిశోధక నౌక 'ఇన్వెస్టిగేటర్ వర్గాలు తెలిపాయి. సముద్రపు ఉపరితలం నుంచి అయిదు కిలోమీటర్ల లోతున చాలా వైవిధ్యమైన చేప జాతులు ఉన్నట్లు నీటి అడుగున వీడియోలు తీశారు.
వీటిలో కళ్లు లేని ఈల్ చేపలు ప్రత్యేకం. మిగిలిన చేపల్లా గుడ్లు పెట్టడానికి బదులు. ఇవి పిల్లలను కంటున్నాయి. గబ్బిలం..ఆకారంలో ఉండే మరో రకం చేప చేతుల్లా ఉన్న రెక్కల సాయంతో తిరుగాడుతుంది. ముక్కుపై ఉన్న కండను ఎరగా చూపి ఇది వేటాడుతుంది. దిగువ భాగంలో నమ్మశక్యం కాని పొడవైన రెక్క లాంటివి ఉండే ట్రిబ్యూట్ స్పైడర్ఫిష్ (సాలీడు చేప)లనూ అక్కడ గుర్తించారు. ఈ రెక్కల సాయంతో ఇది ప్రవాహం దిగువన నిలదొక్కు కొని చిన్నపాటి రొయ్యలను తింటుంది. పెలికాన్ఈల్, బల్లి లాంటి చేప, వైపర్ ఫిష్, స్లెండర్ న్నైప్ ఈల్ లాంటి వేర్వేరు జీవాలూ ఉన్నా యని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన చీఫ్ సైంటిస్ట్ టీమ్ ఓ హరా తెలిపింది
Comments
Post a Comment