ఆన్లైన్లో యాదాద్రి బ్రేక్ దర్శనం టికెట్లు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రేక్ దర్శనం కోసం దేవస్థానం ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం గురువారం నుంచి అందుబాట్లోకి వచ్చింది.
ఒక రోజు ముందస్తుగా ఆన్లైన్లో టికెట్లు పొందాలని ఆలయ ఈవో గీత సూచించారు.
బ్రేక్ దర్శనానికి టికెట్ ధర రూ.300గా ఉంది. ఆసక్తిగల వారు https://yadadritemple.telangana.gov.in/dservices/index.php. వెబ్సైట్లో ఈ-దర్శన్ విభాగంలోకి వెళ్లి టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
Comments
Post a Comment