వికలాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖలొ డిగ్రీ అర్హతతో జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్
విద్యార్హతలు:
హెల్ప్ డెస్క్ కో-ఆర్డినేటర్: ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివిన వారు అర్హులు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (హ్యూమానిటీ, సోషల్ వర్క్స్, సైకాలజీ, ట్రాన్స్ జండర్ సంక్షమేము కొరకు పని చేస్తూ ఉండి, ఏదైనా ట్రాన్స్ జెండర్ స్వచ్ఛంద సంస్థ లో మూడేళ్ల అనుభవం కలిగిన వారికి దరఖాస్తులో ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.50 వేల వేతనం ఉంటుంది. దరఖాస్తుదారుల వయస్సు 21-45 ఏళ్లలోపు ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివి.. కంప్యూటర్ శిక్షణలో PGDCA లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయస్సు 21-45 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.26 వేల వేతనం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ:
- అభ్యర్థులు దరఖాస్తులను https://wdsc.telangana.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఈ వెబ్ సైట్ ఓపెన్ చేయగానే హోం పేజీలో Notification for fill up the posts of Home Coordinator and Data Entry Operator under Help Desk for Transgender persons-2022 లింక్ కనిపిస్తుంది.
- ఆ లింక్ పై క్లిక్ చేయగానే నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
- అప్లికేషన్ ఫామ్ ను నింపి సంచాలకుల వారి కార్యాలయం, వికలాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, మలక్ పేట, నల్లగొండ ఎక్స్ రోడ్, హైదరాబాద్ చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 040-24559048 నంబర్ ను సంప్రదించాల్సి ఉంటుంది
Comments
Post a Comment