భారత దేశం – పరిశ్రమలు- 10 Questions

 Indian Geography- 10 Questions  

Date: 6-12-2022.

Topic: భారత దేశం – పరిశ్రమలు   
 
Introduction:- ఆధునిక యుగంలో దేశ ఆర్ధికాభివృద్ధి ప్రధానంగా పరిశ్రమలపై ఆధారపడి ఉంటుంది. అనువైన స్థాన, భౌతిక పరిస్థితుల రణాలే క స్థితిగతులు మీద కూడా పారిశ్రామిక అభివృద్ధి ఆధారపడి ఉంది. 
* భారతదేశంలో భారీ పరిశ్రమలు 19వ శతాబ్దం మధ్య కాలంలో నుంచి ప్రారంభమయ్యాయి. 
* ఈ పరిశ్రమలు ప్రారంభం కావడానికి అప్పుడే నిర్మించిన రైలు మార్గాలు, కొత్తగా కని పెట్టిన బొగ్గు ఇనుము నిల్వలు మొదలైనవి కారణా భారతదేశంలో భారీ పరిశ్రమల స్థాపన నూలు మిల్లులతో ప్రారంభమైంది. నిజమైన పారిశ్రామిక విప్లవము భారతదేశం దశకంలో ప్రారంభమైందని చెప్పవచ్చు. 
* స్వాతంత్య్రానంతరం ప్రణాళికల అమలుతో ఈ అభివృద్ధి ఊపందుకుంది, మన దేశంలో మొట్టమొదటి భారీ నూలు మిల్లు బొంబాయిలో 1854 సం॥లో ప్రారంభమైంది.
* 1855 సం॥లో కలకత్తా సమీపంలో ఉన్న శ్రీరాంపూర్ వద్ద రిమ్రి అనే చోట మొట్టమొదటి జనపనార మిల్లు స్కాట్లాండ్ దేశస్తుల పెట్టుబడితో ప్రారంభమైంది..
* మొదటి కాగితపు పరిశ్రమ 1870లో కలకత్తా సమీపంలో బాలీ అనే చోట ప్రారంభమయింది. ఆ తర్వాత గాజు,ఉన్న సిల్కు, చక్కెర, సిమెంట్, రబ్బరు మొదలయిన పరిశ్రమలు ప్రారంభమయ్యాయి.
వీటన్నింటిలో జనపనార పరిశ్రమ అతి త్వరగా అభివృద్ధి చెందింది. 1907సం॥లో సబ్బీ (జంషెడ్ పూర్) వద్ద టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ప్రారంభం కావడంతో భారతదేశంలో పారిశ్రామి ప్రతి ఆరంభమయ్యిందని చెప్పవచ్చు.
ప్రస్తుతం భారతదేశంలో సంఘటిత రంగంగా వ్యవహరించే రెండు లక్షల పెద్ద కర్మాగారాలు ఉన్నాయి. అసంఘటిత రంగం పేర్కొనే మూడు కోట్ల చిన్న పారిశ్రామిక కేంద్రాలు ఉన్నాయి. తవన్నీ కలిపి దేశంలోని 46 కోట్ల కార్మిక వర్గంలో అయిదింట, ఒక వంతుకు ఉపాధి కల్పిస్తున్నాయి..
* పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమలు స్థాపించి ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేస్తాయి
* పారిశ్రామిక అభివృద్ధికి కావలసినవి: ముడి పదార్థాలు, రవాణా సౌకర్యాలు, మార్కెట్ సౌకర్యాలు, సరైన యాజమాన్యం.                           


                                         
                                                      
10 Questions

 1.భారతదేశంలో తొలి స్పాంజ్ ఐరస్ ప్లాంట్  ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) భద్రాచలం
బి) పాల్వంచ
సి) షాద్ నగర్
డి) ఆదిలాబాద్
సమాధానం: బి 


2.  ఖమ్మం జిల్లాలోని పాల్వంచ స్పాంజ్ ఐరస్ ప్లాంట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1960
బి) 1970
సి) 1980
డి) 1950
సమాధానం: సి  

3. అజాంజాహీ మిల్స్ ఎక్కడ ఉంది?
ఎ) వరంగల్
బి) ఖమ్మం
సి) మహబూబ్నగర్
డి) హైదరాబాద్ 
సమాధానం: ఎ 

4. డి.బి.ఆర్. మిల్స్ ఎక్కడ ఉంది?
ఎ) హైదరాబాద్
బి) కరీంనగర్
సి) వరంగల్
డి) ఖమ్మం 
సమాధానం: ఎ 

5. ఆసియాలో అతి పెద్ద చక్కెర పరిశ్రమ ఎక్కడ ఉంది?
ఎ) బోధన్
బి) జహీరాబాద్
సి) మిర్యాలగూడ
డి) కరీంనగర్ 
సమాధానం: ఎ 

6. ఐ.టి.సి. (ఇండియస్ టోబాకో కంపెనీ) ఎక్కడ ఉంది?
ఎ) సారపాక
బి) భద్రాచలం
సి) ఆదిలాబాద్
డి) కాజిపేట 
  సమాధానం: ఎ 


7. వి.ఎస్.టి. అనేది ఒక
ఎ) చక్కెర కర్మాగారం
బి) స్పాంజ్ ఐరన్ కంపెనీ
సి) సిగరెట్ తయారీ కంపెనీ
డి) భారీ వాహనాల తయారీ కంపెనీ
సమాధానం: సి 

8.   పెట్టుబడి పరిమితి మరియు వార్షిక ఉత్పత్తి పరిమితి ఆధారంగా పరిశ్రమలు  ఎన్ని రకాలు ?
ఎ) సూక్ష్మ పరిశ్రమ 
బి) చిన్న పరిశ్రమలు 
సి) మధ్య తరహా పరిశ్రమలు 
డి ) పైవన్నీ
సమాధానం: డి

9.  ఈ క్రింది ఏ పంటను “గోల్డెన్ ఫైబర్” అని పిలుస్తారు ?
a) పత్తి 
b) పొగాకు 
c) రబ్బరు 
d) జనుము 
సమాధానం : d

10.  స్టెయిన్లెస్ స్టీల్ తయారీకి ప్రసిద్ధి చెందిన ఇనుము ఉక్కు కర్మాగారం ఏది?
1) బొకారో
2) రాష్ట్రీయ ఇస్పాత్ (విశాఖపట్నం)
3) సేలం
4) విజయనగర స్టీల్స్
సమాధానం: 3

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.