నిరుద్యోగులకు మరో శుభవార్త.. 1147 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ..
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్ 1, 2,3, 4లతో పాటు పలు విభాగాల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తాజాగా వైద్యారోగ్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మంత్రి హరీష్ రావు ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారికంగా ట్వీట్ చేశారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి. లాంటి పూర్తి వివరాల
నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 1147 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఉన్న అసిస్టింట్ ఫ్రోఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అనాటమీ (26), అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిజియాలజీ (26), అసిస్టెంట్ పథాలజీ (31), అసిస్టెంట్ ప్రొఫెసర్ కమ్యూనిటీ మెడిసిన్ (23), అసిస్టెంట్ ప్రొఫెసర్ మైక్రో బయాలజీ (25), అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫొరెన్సిక్ మెడిసిన్ (25), అసిస్టెంట్ ప్రొఫెసర్ బయో కెమిస్ట్రీ (20), అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ (14), అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్ (111), అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ సర్జరీ (117), అసిస్టెంట్ ప్రొఫెసర్ పిడియాట్రిక్ (77), అసిస్టెంట్ ప్రొఫెసర్ అనిస్తీషియా (155), అసిస్టెంట్ ప్రొఫెసర్ రేడియాలజీస్ (46), అసిస్టెంట్ ప్రొఫెసర్ రేడియేషన్ యాంకాలజీ (05), అసిస్టెంట్ ప్రొఫెసర్ సైకియాట్రి (23), అసిస్టెంట్ ప్రొఫెసర్ రెసిపెటరీ మెడిసిన్ (10)..
అసిస్టెంట్ ప్రొఫెసర్ డెర్మటాలజీ మెడిసిన్ (13),
అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఒబెస్ట్రిక్ అండ్ గైనకాలజీ (142),
అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఆప్తామాలజీ (08),
అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్థోపెడిక్స్ (62),
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒటో రిహ్నో (15),
అసిస్టెంట్ ప్రొఫెసర్ హాస్పిటల్ అడ్మిన్ (14),
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎమర్జెన్సీ మెడిసిన్ (15),
అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్డియాలజీ (17),
అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్డిక్ సర్జరీ (21),
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎండోక్రినోలజీ (12),
అసిస్టెంట్ ప్రొఫెసర్ న్యూరాలజీ (11),
అసిస్టెంట్ ప్రొఫెసర్ న్యూరో సర్జన్ (16), అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్లాస్టిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ (17), అసిస్టెంట్ ప్రొఫెసర్ పిడియాట్రిక్ సర్జరీ (08), అసిస్టెంట్ ప్రొఫెసర్ యూరాలజీ (17), అసిస్టెంట్ ప్రొఫెసర్ నెఫ్రాలజీ (10), అసిస్టెంట్ ప్రొఫెసర్ మెడికల్ అంకాజలీ (01) ఖాళీలు ఉన్నాయి
https://twitter.com/trsharish/status/1600111307562549249?t=Pn62mE2PvH5EdoOjg2f5Ig&s=19
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా జనవరి 05, 2023గా నిర్ణయించారు. ఈ ఖాళీల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది
Comments
Post a Comment