18 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ప్రకటన

TSPSC మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని డ్ర‌గ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేష‌న్ విభాగంలో 18 డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి TSPSC తాజాగా ప్రకటన (21/2022) విడుదల చేసింది... డ్ర‌గ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేష‌న్ విభాగంలో ఖాళీగా ఉన్న 18 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన‌ట్లు TSPSC ప్ర‌క‌టించింది. అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ నెల 16 నుంచి జ‌న‌వ‌రి 5వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. పూర్తి వివ‌రాల కోసం https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల్లో 5 ఉద్యోగాలు 

మల్టీ జోన్ -1 పరిధిలో ఉన్నాయి. 

మల్టీ జోన్‌ 2 పరిధిలో 13 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు 2022 జులై 1 నాటికి 18 నుంచి 44ఏళ్ల మధ్య వయసు ఉన్న వారై ఉండాలి. డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు 2023 మే, జూన్ నెలల్లో రాత పరీక్షలు నిర్వహిస్తారు.




డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ నియామకాలను కంప్యూటర్ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌ లేదంటే ఆఫ్‌లైన్‌లో ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసే వారు. ఫార్మసీలో డిగ్రీ, ఫార్మాస్యూటికల్ సైన్స్‌, డిఫార్మసి, మెడిసిన్‌లో క్లినికల్ ఫార్మకాలజీ డిగ్రీ, మైక్రో బయాలజీలలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి


డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాల్లో తెలంగాణ ఆర్టీసి, ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేషన్లు, మునిసిపాలిటీల ఉద్యోగులకు ఐదేళ్ల వరకు వయోపరిమితిలో మినహాయింపునిస్తారు. ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌, ఎన్‌సిసి ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసిన వారికి మూడేళ్ల మినహాయింపు ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యుఎస్‌ విభాగాల్లో ఐదేళ్ల సడలింపునిస్తారు.


దరఖాస్తు ఫీజు:
డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసే వారు రూ.200 రుపాయలు ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగ యువత ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న వారు పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్షను హైదరాబాద్‌లో మాత్రమే నిర్వహిస్తారు.

ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్-4 నోటిఫికేష‌న్(9,168 ఉద్యోగాలు), మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్‌లో 1147 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు వెలువ‌డ‌గా, తాజాగా పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చ‌ర‌ర్ల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. మ‌రో వైపు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఈ పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌లో భాగంగా గురువారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఈవెంట్స్ ప్రారంభ‌మైన విషయం కూడా తెలిసిందే.

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.