పదో తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు సబ్జెక్టులో 20 మార్కులు వచ్చినా పాస్‌

 తెలంగాణ రాష్ట్ర పదో తరగతి విద్యార్థులకు శుభవార్త! ఇకపై పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో తెలుగు సబ్జెక్టుకు కేవలం 20 మార్కులు వచ్చినా పాస్‌ అయినట్లేనని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ఐతే అందుకు ఓ షరతు వర్తిస్తుంది. అదేంటంటే పదో తరగతిలో తెలుగు సబ్జెక్టును సెకండ్ ల్యాంగ్వేజ్‌గా ఎంపిక చేసుకున్న విద్యార్ధులు మాత్రమే పబ్లిక్‌ పరీక్షల్లో 20 మార్కులు వచ్చినా పాస్‌ అవుతారు





తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరి అమలు చేయాలనే నిబంధనల్లో భాగంగా.. ఇతర మీడియంలలో చదివే విద్యార్థులు తెలుగును కచ్చితంగా ఒక సబ్జెక్టుగా తీసుకోవడం అనివార్యమైంది. తెలుగు మాతృభాషగాలేని విద్యార్ధులు తెలుగును సెకండ్ లాంగ్వేజ్‌గా ఎంచుకుంటేనే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ఈ మేరకు తెలియజేస్తూ తెలంగాణ విద్యశాఖ ప్రకటన జారీ చేసింది

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.