హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 212 పోస్టులు.. | బీటెక్‌ అర్హత

 తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌).. 212 గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్, డిప్లొమా అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిల్లో గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ఖాళీలు 150, డిప్లొమా ఖాళీలు 62 ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఈసీఈ/సీఎస్‌ఈ/ఎమ్‌ఈసీహెచ్‌/ఈఈఈ/ఈఐఈ/సివిల్‌ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌, మూడేల్ల డిప్లొమా లేదా తత్సమాన ఇంజనీరింగ్‌ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.



ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 26, 2022 రాత్రి 10 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. మెరిట్‌ లిస్ట్ డిసెంబర్‌ 31న విడుదల చేస్తారు. అప్రెంటిస్ ట్రైనింగ్ జనవరి 2, 2023 నుంచి ప్రారంభమవుతుంది. ఎంపికైన వారికి9000ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.



Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.