గురుకులాల్లో మరో 2,591 పోస్టులు..
తెలంగాణలో(Telangana) ఉద్యోగ జాతర కొనసాగుతూనే ఉంది. టీఎస్పీఎస్సీ నుంచి వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. దీంతో పాటు.. కొత్త పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతోంది. దీనిలో భాగంగానే.. బీసీ సంక్షేమ శాఖలో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్(Residential) విద్యాసంస్థల్లోని పలు విభాగాల్లో మొత్తం 2,591 నూతన ఉద్యోగాల నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రారంభించిన 4 జూనియర్ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు, 33 రెసిడెన్షియల్ పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ విభాగాల్లో అవసరమైన మేరకు ఈ నూతన నియామకాలను చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది
రోడ్లు, భవనాల శాఖలో పెరిగిన పనికి అనుగుణంగా శాఖను పునర్ వ్యవస్థీకరించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బి శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది.
ఇందులో కొత్తగా 3 చీఫ్ ఇంజనీర్ పోస్టులు,
12 సూపరిండెంట్ ఇంజనీర్ పోస్టులు,
13 ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు,
102 డి.ఈ.ఈ పోస్టులు,
163 అసిస్టెంట్ ఈ.ఈ పోస్టులు,
28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులతో పాటు పలు టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది పోస్టులున్నాయి.
ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది. దాంతో పాటు సత్వరమే పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.
హైదరాబాద్ , సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని హోంశాఖను కేబినెట్ ఆదేశించింది.
వీటితో పాటు ఇటీవల పీఎల్ (పాలిటెక్నిక్ ), డ్రగ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చిన టీఎస్పీఎస్సీ తాజాగా 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ శుక్రవారం (డిసెంబర్ 9) నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన దగ్గర నుంచి ఇంత వరకు జేఎల్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. తాజాగా ఈ నోటిఫికేషన్ వెల్లడి కావడంతో.. నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి వివరాలు మీకోసం..
Comments
Post a Comment