కోర్టుల్లో 4600 పోస్టుల భర్తీకి ఆమోదం

 తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో 4,600లకుపైగా ఉద్యోగాలకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెల్పింది. ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా పోస్టులకు సోమవారం (డిసెంబ‌రు 12) జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో కోర్టుల్లో సిబ్బంది నియామకాల కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు తాజాగా అనుమతి లభించినట్లైంది. ఈ నియామకాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ త్వరలో విడుదల కానుంది.




ఇప్పటికే తెలంగాణ పోలీసు, బీసీ సంక్షేమ, రోడ్లు భవనాల శాఖల్లో కలిపి మొత్తం 7,029 కొత్త నియామకాలకు రాష్ట్ర క్యాబినెట్‌ అనుమతి తెల్పిన విషయం తెలిసిందే. ఈ రోజు మరో 4,200ల పోస్టులకు అనుమతి లభించడంతో.. రానున్న రోజుల్లో మొత్తం 11 వేలకు పైగా ఉద్యోగాలను నియామక ప్రక్రియ ప్రారంభంకానుంది.

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.