విద్యార్థినులకు గుడ్ న్యూస్.. రూ.50వేల స్కాలర్ షిప్
- ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బాలికల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రగతి స్కాలర్‌షిప్ పథకం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పేద విద్యార్థులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఈ పథకాన్నిప్రవేశ పెట్టారు.
- ఉన్నత విద్యా సంస్థ AICTE ప్రతి సంవత్సరం ఈ పథకం కింద మహిళా ఇంజనీరింగ్ విద్యార్థులకు రూ. 50,000 స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ప్రగతి స్కాలర్‌షిప్ పథకం కింద ప్రతి సంవత్సరం 4,000 మంది విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌లను అందజేస్తారు.
- ఇందులో 2000 డిగ్రీ కేటగిరీకి, 2000 డిప్లొమా విద్యార్థులకు ఇస్తారు. ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేయడానికి.. మహిళా విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసిస్తూ ఉండాలి. మహిళా
విద్యార్థులు AICTE గుర్తింపు పొందిన కళాశాల నుండి మొదటి సంవత్సరం డిగ్రీ/డిప్లొమా అభ్యసించి ఉండాలి.
- అకడమిక్ స్కోర్‌ల ఆధారంగా విద్యార్థులను స్కాలర్‌షిప్ కోసం ఎంపిక చేస్తారు. కళాశాల ఫీజు/చెల్లింపు మొత్తం రూ. 30,000 ఇస్తారు. దీంతో పాటు.. ప్రతి సంవత్సరం 10 నెలల పాటు నెలకు రూ.2వేలు ఇస్తారు.
- ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు ఉంటే.. ఆ ఇద్దరు కూడా ఈ పథకానికి అర్హులుగా పేర్కొన్నారు. వారి యొక్క కుటుంబ ఆదాయం రూ.8లక్షల లోపు ఉండాలి. ఎంపిక చేసే క్రమంలో రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు. దీని ప్రకారం ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీ, ఇతరులకు 27% ఇస్తారు. దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ఇలా ఉన్నాయి.
- 10వ తరగతి, 12వ తరగతి మార్కుల సర్టిఫికెట్, కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం, ,[object Object],కళాశాలలో డిగ్రీ లేదా డిప్లొమాకు సంబంధించి అలాట్ మెంట్ ఆర్డర్ జిరాక్స్, ఇన్‌స్టిట్యూషన్ హెడ్/ప్రిన్సిపాల్ జారీ చేసిన సర్టిఫికేట్, ఆధార్ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు వంటి సిర్టిఫికేట్స్ ఉండాలి.
- ఈ స్కాలర్‌షిప్ కు దరఖాస్తు చేసుకోవాలనుకునే మహిళలు డిసెంబర్ 31, 2022లోపు చేసుకోవాలి. ప్రగతి అధికారిక వెబ్‌సైట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న అన్ని సర్టిఫికేట్‌లతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఆ వెబ్ సైట్ లింక్ ఇదే.. https://www.aicte-pragati-saksham-gov.in/ దరఖాస్తుదారుల దరఖాస్తులను పరిశీలించిన తర్వాత.. అర్హులైన అభ్యర్థుల బ్యాంకు ఖాతాలో స్కాలర్‌షిప్ జమ చేయబడుతుంది.
Comments
Post a Comment