మెడికల్ కాలేజీల్లో 631 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో.. రెగ్యులర్ ప్రాతిపదికన 631 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సీటీ సర్జరీ, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ జీఈ, మెడికల్ అంకాలజీ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, సర్జికల్ జీఈ, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, అనస్థీషియా, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, ఓబీజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియాలజీ, రేడియోథెరపీ, టీబీ & సీడీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మాకాలజీ, ఫిజియాలజీ, ఎస్‌పీఎం, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ, కన్జర్వేటివ్‌ డెంటిస్ట్రీ, ఓరల్ మాక్సిలో ఫేషియల్ సర్జరీ, ఓరల్ పాథాలజీ, ఆర్థోడాంటిక్స్, పెడోంటిక్స్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.




సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం, ఎండీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్‌ 7, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.1000లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/వికలాంగ అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.