ఈరోజు నుంచి జూనియర్ కాలేజీ లెక్చరర్స్ నోటిఫికేషకు కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

 తెలంగాణ ప్రభుత్వం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇటీవల జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్(JL) ఉద్యోగాల బర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 



అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ద్వారా డిసెంబర్ 20, 2022 నుంచి జేఎల్ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈరోజు  దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కానుంది. అప్లికేషన్ స్వీకరణకు చివరి తేదీ జనవరి 10, 2023 వరకు ఉంటుంది.



కేటగిరీల వారీగా పోస్టులు ఇలా..


జూనియర్ లెక్చరర్ పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. అరబిక్ , బోటనీ , బోటనీ (ఉర్దూ మీడియం), కెమిస్ట్రీ , కెమిస్ట్రీ(ఉర్దూ మీడియం), కామర్స్ , కామర్స్ (ఉర్దూ మీడియం), ఎకనామిక్స్, ఎకనామిక్స్ (ఉర్దూ), ఇంగ్లీష్ , ఫ్రెంచ్, హిందీ, హిస్టరీ, హిస్టరీ (ఉర్దూ మీడియం), హిస్టరీ (మరీఠీ మీడియం), మ్యాథ్స్, మ్యాథ్స్ (ఉర్దూ మీడియం), ఫిజిక్స్ , ఫిజిక్స్(ఉర్దూ మీడియం), సాంస్క్రీట్(Sanskrit), తెలుగు , ఉర్దూ, జువాలజీ , జువాలజీ (ఉర్దూ మీడియం) వంటి విభాగాల్లో జేఎల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


అర్హత వివరాలు ఇలా..


పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీ(ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం) సెకండ్ క్లాస్ పూర్తి చేసి ఉండాలి. లేదా బీఏ ఆనర్స్ , బీఎస్సీ ఆనర్స్ లేదా బీకాం ఆనర్స్ పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఉర్దూ మీడియం, మారాఠీ భాషలకు సంబంధించి సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తగరతి వరకు మరాఠీ, ఉర్దూ భాషలో చదువుకొని ఉండాలి. లేదా మొదటి భాషగా ఉర్దూ/ మరాఠీ పదో తరగతి లో చదువుకొని ఉండాలి. దీంతో పాటు.. ఉర్దూ/మరాఠీ సెకండ్ భాష గా బ్యాచ్ లర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.


సివిక్స్ లో జూనియర్ లెక్చరర్స్..


సివిక్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పొలిటికల్ సైన్స్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో 50 శాతం మార్కులతో పీజీ పూర్తి చేసి ఉండాలి. సివిక్స్ (ఉర్దూ మీడియం),సివిక్స్ (మారాఠీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తగరతి వరకు మరాఠీ, ఉర్దూ భాషలో చదువుకొని ఉండాలి. లేదా మొదటి భాషగా ఉర్దూ, మరాఠీ పదో తరగతి లో చదువుకొని ఉండాలి. దీంతో పాటు.. ఉర్దూ/మరాఠీ సెకండ్ భాష గా బ్యాచ్ లర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి



దరఖాస్తు  విధానం..

Step 1 : ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కొరకు అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేయండి.

Step 2 : ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది జూనియర్ లెక్చరర్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.

Step 3 : ఇక్కడ అభ్యర్థి యొక్క టీఎస్పీఎస్సీ ఐడీ తో పాటు.. పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. తర్వాత ఓటీపీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కువెళ్తుంది.

Step 4 : ఇక్కడ మీ ఓటీపీని ఎంటర్ చేయగానే అప్లికేషన్ పారమ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ వ్యక్తిగత వివరాలతో పాటు.. అర్హతకు సంబంధించి వివరాలను నింపాలి.

Step 5 : చివరగా అభ్యర్థి యొక్క వివరాలను సరిచూసుకొని.. దరఖాస్తు ఫీజును చెల్లించాలి. చివరకు సబ్ మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోండి. దీనిని ప్రింట్ తీసుకుంటే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది.

ఇప్పటికే దీనికి సంబంధించి అప్లికేషన్ ఫాం లింక్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉండగా..అది ఈరోజు నుంచి యాక్టివేట్ కానుంది.

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.