విద్యార్థులకు, ఉద్యోగులకు జనవరిలో సంక్రాంతితో పాటు మొత్తం సెలవుల లిస్ట్ ఇదే
మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ ప్రారంభం కానుంది. ఏడాది ప్రారంభ నెల అయిన జనవరి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి సంక్రాంతి సెలవులు. ఇదే నెలలోనే రిపబ్లిక్ డే సైతం ఉంటుంది. దీంతో ఈ నెలలో సెలవులకు కొదువ ఉండదనే చెప్పాలి. ఇంకా ఆదివారాలు, రెండో శనివారం కలిపితే బోలెడు సెలవులు వస్తాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
నెల ప్రారంభంలోనే జనవరి 1న న్యూఇయర్ ఉంటుంది. అయితే.. సాధారణ సెలవుల్లో జనవరి 1ని కూడా ప్రభుత్వం పేర్కొంది. కాకపోతే ఈ సారి జనవరి 1 ఆదివారం రోజు రావడంతో విద్యార్థులు ఉద్యోగులు అదనపు సెలవును పొందే ఛాన్స్ మిస్ అయ్యింది
ఇంకా భోగి పండుగా జనవరి 14న వచ్చింది. ఆ రోజు సైతం సాధారణ సెలవును ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఆ రోజు రెండో శనివారం. దీంతో విద్యార్థులు విద్యార్థులు మరో సెలవును కోల్పోతున్నారు
ఇంకా భోగి మరుసటి రోజు జనవరి 15న సంక్రాంతి ఉంటుంది. అయితే.. సంక్రాంతి కూడా సెలవుదినమైన ఆదివారం రోజే రావడం మరో నిరాశ కలిగించే అంశం
జనవరి 16న సోమవారం కనుమ పండుగకు తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేను ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఉండే అవకాశం ఉంటుంది.
ఇంకా రిపబ్లిక్ డే జనవరి 26న గురువారం రోజు వచ్చింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలకు ఆ రోజు సెలవు ఉంటుంది
ఇంకా.. జనవరి 8, 22, 29 తేదీల్లో ఆదివారం ఉంటుంది. దీంతో ఆయా రోజుల్లో సెలవు ఎలాగూ ఉంటుంది. ఇంకా జనవరి 28న నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు ఆ రోజు సెలవు ఉంటుంది
మొత్తం మీద ఈ నెలలో పండుగలు ఎక్కువగా ఉన్నా.. అవి ఆది, రెండో శనివారం నాడు రావడంతో సెలవులు మాత్రం తక్కువగానే వచ్చాయి
Comments
Post a Comment