వరంగల్‌ ఎన్‌ఐటీలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.

 వరంగల్‌లోని కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. 


డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీరింగ్ ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా అడ్హక్‌ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు



భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా అడ్హక్ ఫ్యాకల్టీ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీహెచ్‌డీ(సివిల్), ఎంటెక్‌(ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్/ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్/ జియోటెక్నికల్ ఇంజినీరింగ్/ రిమోట్ సెన్సింగ్‌, జీఐఎస్‌)ను ఫస్ట్‌ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.


ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అప్లికేషన్‌ ఫామ్‌ను నింపి స్కాన్‌ కాపీని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

* అప్లికేషన్‌ ఫామ్‌ను ఈ లింక్‌ క్లిక్‌ చేయడం ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

* అప్లికేషన్‌ ఫామ్‌ను 8-01-2023 తేదీన సాయంత్రం 5 గంటల లోపు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

* షార్ట్‌ చేసిన అభ్యర్థుల జాబితాను 10-01-2023 తేదీన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూలను 18-01-2023లో నిర్వహసిస్తారు.

* ఇంటర్వ్యూను సివిల్ ఇంజినీరింగ్ విభాగం, నిట్‌ వరంగల్ అడ్రస్‌లో నిర్వహిస్తారు.

* ఎంపికైన అభ్యర్థులు వెంటనే విధుల్లో చేరాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.