తెలంగాణ చరిత్ర & వివరణ

విష్ణుకుండినులు సామాన్య శకం 4వ శతాబ్దం నుంచి సామాన్య శకం 7వ శతాబ్దం వరకు దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని, కోస్తాంధ్ర జిల్లాలను పాలించారు. వంశస్థాపకుడు మహారాజేంద్రవర్మ (ఇంద్రవర్మ). ఇతను తెలంగాణలోని ఇంద్రపాలనగరం (ఇంద్రపురి) రాజధానిగా పాలన ప్రారంభించాడు. మొదట దక్షిణ తెలంగాణ జిల్లాలలో పాలన ప్రారంభించి క్రమక్రమంగా తూర్పువైపు కృష్ణా-గోదావరి మధ్యప్రాంతాలను ఆక్రమించారు. శాతవాహనుల అనంతరము ఆంధ్రదేశమున అత్యధిక ప్రాంతమును పాలించిన రాజవంశమిదియే.



1.వినుకొండకు సంస్కృతీకరణం 'విష్ణుకుండినులు' అని చెప్పిన భాషా శాస్త్రవేత్త?
    1) కృష్ణారావు     2) కేల్విలియం    3) కేల్ హారన్   4. బార్నేట్
     Answer: 3

2. 'ఘటికలు' అనగా?
   1) బౌద్దావిద్యాకేంద్రాలు     2) జైన విద్యాకేంద్రాలు     3) వైదిక విద్యాకేంద్రాలు    4) పైవన్నీయ
     Answer: 3

3.'న్యాయపాలన' ప్రస్తావన ఎందులో ఉంది?
   1) పోలమూరు శాసనం    2) అమరావతి శాసనం     3) చిక్కుళ్ళ తామ్రశాసనం   4) ళానాపూర్
     Answer: 1

4. 'పూర్వమీమాంసం'పై సూత్రాలు రాసింది?
   1) కుమారిలభట్టు   2  ) గోవింద వర్మ    3) మల్లయ్యభట్టు    4) దిగ్జ్ఞాగుడు 
     Answer: 1

5. ఉండవల్లిలో ఉన్న అంతస్థులు ఎన్ని?
   1) రెండు అంతస్థులు     2) మూడు అంతస్థులు    3) నాల్గు అంతస్థులు     4) ఐదు అంతస్థులు
     Answer: 3

6. అమరావతి క్షేత్రం కోసం శైవులకు, బౌద్ధులకు మధ్య సంఘర్షణ ఎవరి కాలంలో జరిగింది ?
   1) కాకతీయులు     2) విష్ణుకుండినులు     3) ఇక్ష్వాకులు       4) పల్లవులు
     Answer: 2

7. విష్ణుకుండినుల కాలంలో ఎన్ని రకాల నాణేలు ఉండేవని 'ఆర్ సుబ్రహ్మణ్యం' గారు నిరూపించారు ?
    1) 12      2) 24        3) 18      4) 16
     Answer: 4

8. తెలంగాణాలో అతిప్రాచీనమైన శాసనం ఎక్కడ ఉంది ?
1) ఏలేశ్వరం      2) కీసర      3) ఇంద్రపాలనగరం    4) పానగల్లు 
     Answer: 1

9. విష్ణుకుండినుల కాలంనాటి జైనమతలోని ఏశాఖను ఆదరించారు?
    1) శ్వేతాంబర     2) దిగంబర శాఖ    3) కాపాలికశాఖ      4) పైవన్నీయు
     Answer: 2

10 'త్రిసముద్రాదిపతి'గా ప్రసిద్ధి చెందిన విష్ణుకుండిన రాజెవరు?
     1) రెండో గోవిందవర్మ      2) మూడో మాధవ వర్మ      3) రెండో మాధవవర్మ    4) ఇంద్రవర్మ
     Answer: 3

Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.