తెలంగాణ ఇంటర్ టైమ్ టేబుల్ వచ్చేసింది.. ..
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీని ప్రకటించారు. 2023లో జరగబోయే వార్షిక పరీక్షలకు సంబంధించి తెలంగాణ ఇంటర్ బోర్డ్ టైమ్ టేబుల్‌ను ప్రకటించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చిన 15న మొదలవుతుండగా ఏప్రిల్ 3న ముగియనున్నాయి. ఇక సెకండ్ ఇయర్ విషయానికొస్తే మార్చి 15న మొదలై ఏప్రిల్ 4వ తేదీన ముగుస్తాయి. పరీక్షలను ఉదయం గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక ప్రాక్టికల్ ఎగ్జామ్స్ విషయానికొస్తే ఫిబ్రవర్ 15వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు
ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ ఎగ్జామినేషన్ పరీక్షలను 04-03-2023 తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. అలాగే ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను 06-03-2023 తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు.
పూర్తి టైమ్ టేబుల్..
Comments
Post a Comment