భారతదేశ నదులు – నీటి పారుదల వ్యవస్థ
భారతదేశ నదులు – నీటి పారుదల వ్యవస్థ
Introduction:- నది ప్రవహించే మార్గాన్ని నదీ ప్రవాహ మార్గం అంటారు. భూ ఉపరితలంమీద నైసర్గిక స్వరూపాలను మార్చి అనేక కారకాలలో నదీ ప్రవాహాలు ముఖ్యమైనవి. నదులను దాని ఉపనదులను కలిసి నదీ వ్యవస్థ అంటారు.నది నుంచి విడిపోయి ప్రవహించే జల మార్గాలను పాయలు అంటారు. విముఖంగా ప్రవహించే రెండు నదీ వ్యవస్థల మధ్య గల ఎత్తైన ప్రదేశాన్ని జల విభాజక క్షేత్రం అంటారు. సమాంతరంగా ప్రవహించే నదుల మధ్య గల ఎత్తైన ప్రదేశములను అంతర్ నదీ క్షేత్రం అంటారు. ఒక ప్రాంతంలో పడిన వర్షపు నీరు ఉపనదుల ద్వారా నదిని చేరుతుందో ఆ ప్రాంతాన్ని అంతటిని కలిపి నదీ పరివాహక ప్రాంతం అంటారు.భారతదేశంలో నదుల ద్వారా ప్రవహించే నీటిలో 90% బంగాళాఖాతంలో కలుస్తుండగా, 10% నీరు అరేబియా సముద్రంలో కలుస్తుంది. భారతదేశంలో నదులను వాటి పరివాహక ప్రాంత పరిమాణాన్ని అనుసరించి మూడు రకాలుగా విభజించవచ్చు. అవి.....
1) ప్రధాన నదులు : ఇవి 20,000 చదరపు కి.మీ లేదా అంతకంటే ఎక్కువ పరివాహక ప్రాంతాన్ని కలిగిన నదులు.
దేశంలో ఈ నదులు 14 ఉన్నాయి. మొత్తం 'రన్ ఆఫ్'లో 85 శాతం ఈ నదులకు చెందినదే.
2) మధ్యస్థ నదులు : ఇవి 2000-20,000 చ.కి.మీ ల పరివాహక ప్రాంతం ఉన్న నదులు. దేశంలో ఇవి 44 ఉన్నాయి.
7 శాతం రన్ ఆఫ్ వీటికి చెందినది.
3) చిన్న నదులు: 2,000 చ.కి.మీ కంటే తక్కువ రన్అఫ్ కలిగిన నదులు. ఇవి 55 ఉన్నాయి. 8 శాతం రన్ ఆఫ్ వీటికి
చెందినది.
1. ప్రతిపాదన (A) : భారతదేశంలో అత్యధిక పరివాహక ప్రాంతం కలిగిన నది – బ్రహ్మపుత్ర
కారణం (R) : దేశంలో అతిపెద్ద అంతర్భూభాగ నదీవ్యవస్థ కలిగిన రాష్ట్రం - రాజస్తాన్
1. (A) మరియు (R) రెండూ సరైనవి (A) కు (R) సరి అయిన వివరణ
2. (A) మరియు (R) రెండూ సరైనవి కాని (A) కు (R) సరి అయిన వివరణ కాదు.
3. (A) సరైనది కాని (R) సరికాదు
4. (A) సరైనది కాదు, కాని (R) సరియైనది
సమాధానం : 4
2. క్రింది వాటిలో సరియైన వాక్యాన్ని గుర్తించండి ?
1. భారతదేశంలో అత్యధిక శాతం నీటిని వినియోగిస్తున్ననది - కావేరి నది
2. భారతదేశంలో పగులు లోయలో ప్రవహించే నదులు - ఒకటి
3. Poetic నది అని కృష్ణా నదిని పిలుస్తారు
4. భారతదేశంలో డెల్టాను ఏర్పరచని నది మహానది
సమాధానం : 1
3. సింధూ నది గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి ?
1. సింధూ నది భారత్ లో లడఖ్, జస్కర్ శ్రేణుల మధ్యగుండా ప్రవహిస్తుంది.
2. సింధూ నది ఎక్సోటిక్ నదికి ఉదాహరణ
3. సింధూ నదిని పర్షియన్లు హైందలి నది అని అంటారు.
4. సింధూ నది ఉపనదులలో పొడవైన ఉపనది చీనాబ్
సమాధానం : 4
4. జతపరుచుము ?
నదులు పుట్టుక
ఎ. అలక నంద 1. చెమయాంగ్ డంగ్ హిమానీనదం
బి. బ్రహ్మపుత్ర 2. మిలాయ్ హిమానీనదం
సి. శారద 3. మహాబలేశ్వర్
డి. కృష్ణ 4. సతపనాధ్
1. ఎ-1, బి-2, సి-4, డి-3 2. ఎ-2, బి-1, సి-4, డి-3
3. ఎ-4, బి-2, సి-3, డి-1 4. ఎ-4, బి-1, సి-2, డి-3
సమాధానం : 4
5. ఈ క్రింది వివరణ చదవండి ?
ఎ. బ్రహ్మపుత్ర నది ఒక అంతర్వర్తిత నది
బి. బ్రహ్మపుత్ర నదిని అసోంలో సాంగ్ పో నది అంటారు
సి. బేల్ సిరి, ధన్ సిరి బ్రహ్మ పుత్ర నది ఉప నదులు
వీటిలో సరి కాని వాటిని గుర్తించుము ?
1.ఎ మరియు బి 2. బి మరియు సి
3. ఎ మరియు సి 4. ఎ, బి మరియు సి
సమాధానం : 1
6. క్రింది నదులను వాటి పొడవును బట్టి ఆరోహణ క్రమంలో అమర్చండి?
ఎ. నైలు బి. అమేజాన్
సి. హెూయంగ్ హెూ డి. మిసిసిపి
1. ఎ, బి, సి, డి 2. బి, సి, డి, ఎ
3. డి, సి, బి, ఎ 4. సి, డి, బి, ఎ
సమాధానం : 3
7. హిమాలయాల కంటే ముందుగా జన్మించిన నదులను గుర్తించండి ?
ఎ. సింధూ బి. గంగా
సి. బ్రహ్మపుత్ర డి. సట్లేజ్
1. ఎ, బి, సి 2. బి, సి, డి
3. ఎ, బి, డి 4. ఎ, సి, డి
సమాధానం : 4
8. ఈ క్రింది ప్రవచనాలు చదవండి?
ఎ. శ్రీకాళహస్తి సువర్ణముఖి నది ఒడ్డున ఉంది.
బి. నాగావళిని లాంగుల్య అని కూడా పిలుస్తారు.
సి. స్వర్ణముఖి నెల్లూరు జిల్లాలోని అందాలమాల వద్ద బంగాళాఖాతంలో కలియును.
పై ప్రవాచనాలలో సరైన వాటిని గుర్తించండి.
1. ఎ, బి లు సరైనవి 2. బి, సి లు సరైనవి
3. ఎ, సి లు సరైనవి. 4. ఎ, బి, సి లు సరైనవి
సమాధానం : 4
9. క్రింది వాక్యాలలో సరికాని దానిని గుర్తించండి ?
1. వింధ్యా, సాత్పురా పర్వతాల మధ్య ప్రవహిస్తున్న నది- తపతి
2. నర్మదా, తపతి నదుల మధ్య విస్తరించి ఉన్న పర్వతశ్రేణి -సాత్పురా
3. సాత్పురా, అజంతా కొండల మధ్య ప్రవహిస్తున్న నది - తపతి
4. తపతి, పెంగా నదుల మధ్య విస్తరించి వున్న పర్వతశ్రేణి - అజంతా కొండలు
సమాధానం : 1
10. ప్రతిపాదన (A) : భారత ద్వీపకల్పంలో పడమరవైపు ప్రవహించే నదులకు డెల్టాలు లేవు.
కారణము (R) : ఈ నదులు వేగంగా ప్రవాహిస్తాయి,
1. (A) మరియు (R)లు రెండు సరైనవి. (A)కి (R) సరియైన వివరణ
2. (A) మరియు (R)లు రెండు సరైనవి. (A)కి (R) సరియైన వివరణ కాదు
3. (A) సరియైనది, కాని (R) సరియైనది కాదు
4. (A) సరియైనది కాదు, కాని (R) సరియైనది.

Comments
Post a Comment