ISRO శుభవార్త చెప్పింది.. 526 పోస్టుల భర్తీ | డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ అవకాశం..

 ISRO(Indian Space Research Organization) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 526 పోస్టులను భర్తీ చేయనున్నారు. 



అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్(Website) సందర్శించి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

ఎంపికైన అభ్యర్థులకు భారతదేశంలో ఎక్కడైనా ఉపాధి కల్పించబడుతుంది.

 దరఖాస్తు చేయడానికి జనవరి 09, 2023 చివరి తేదీగా నోటిఫికేషన్ లో(Notification) పేర్కొన్నారు. నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ. 25,500 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 526 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అసిస్టెంట్- 339, 

జూనియర్ పర్సనల్ అసిస్టెంట్- 153, 

సీనియర్ డివిజన్ క్లర్క్- 16, 

స్టెనోగ్రాఫర్- 14, 

అసిస్టెంట్ (స్పేస్)- 3,

జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ (స్పేస్)- 1 పోస్టు ఖాళీగా ఉన్నాయి.


అర్హతలు..

అసిస్టెంట్ పోస్టులకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

జూనియర్ పర్సనల్ అసిస్టెంట్- డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

సీనియర్ డివిజన్ క్లర్క్- గ్రాడ్యుయేషన్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు.. డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

అసిస్టెంట్ (స్పేస్)- గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి.

జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ (స్పేస్)- డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

వయో పరిమితి: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థుల వయస్సు జనవరి 9, 2023 నాటికి గరిష్టంగా 28 ఏళ్లు మించకూడదు. కనిష్టంగా 18 ఏళ్ల ఉండాలి

వయస్సు సడలింపు:

OBC అభ్యర్థులు- 3 సంవత్సరాలు

SC/ST అభ్యర్థులు- 5 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు..

జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. స్త్రీ/SC/ST/PWD/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. చెల్లింపు విధానం - ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో చేయవచ్చు.

ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో ఉంటుంది. ముందుగా రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ: 20/12/2022

దరఖాస్తుకు చివరి తేదీ: 09/01/2023

దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ: 11/01/2023

దరఖాస్తులు చేసుకోవడానికి అభ్యర్థులు డైరెక్ట్ గా ఈ లింక్ పై క్లిక్చేసి.. దరఖాస్తులు సమర్పించవచ్చు.

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.