TSPSC Online Application: అభ్యర్థులకు అలర్ట్.. ఆ పోస్టులకు ఈరోజు నుంచి దరఖాస్తులు..
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇటీవల పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిపికేషన్ ద్వారా మొత్తం 247 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 19 సబ్జెక్టులకు సంబంధించి 247 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 14న ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 4 ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన డిటైల్డ్ నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ www.tspsc.gov.in లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
విద్యార్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో ఎంటెక్ లేదా ఎమ్మెస్సీ చేసిన వారికి పేస్కేల్ లెవల్ 10 ఆధారంగా చెల్లిస్తారు.
ఈ పోస్టులను మల్టీ జోన్ల వారీగా భర్తీ చేస్తారు. మల్టీ జోన్ 1 లో 93 పోస్టులుండగా.. మల్టీ జోన్ 2లో 154 పోస్టులున్నాయి.
విభాగాల వారీగా ఖాళీలు ఇలా..
1. ఆటో మొబైల్ ఇంజనీరింగ్ - 15
2. బయో-మెడికల్ ఇంజనీరింగ్ - 03
3.కెమికల్ ఇంజనీరింగ్ - 01
4. సివిల్ ఇంజనీరింగ్ - 82
5. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 24
6. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 41
7. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ - 01
8. ఫుట్ వేర్ టెక్నాలజీ - 05
9. లెటర్ ప్రెస్ (ప్రింటింగ్ టెక్నాలజీ) - 05
10. మెకానికల్ ఇంజనీరింగ్ - 36
11. మెటలర్జీ - 05
12. ప్యాకేజింగ్ టెక్నాలజీ - 03
13. టానరీ - 03
14. టెక్స్‌టైల్ టెక్నాలజీ - 01
15. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ - 04
16. ఫార్మసీ - 04
17. జియాలజీ - 01
18. కెమిస్ట్రీ - 08
19. భౌతికశాస్త్రం - 05
అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.56,100 నుంచి రూ. 1,82,400 మధ్య చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ ఇలా
అభ్యర్థులను రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తం 450 మార్కులకు రెండు పేపర్లలో పరీక్ష ఉంటుంది. మొదటి పేపర్ జనరల్ స్టడీస్ 150 మార్కులకు ఉంటుంది. రెండో పేపర్ సంబంధిత సబ్జెక్టుకు సంబంధించి 150 ప్రశ్నలకు 300 మార్కులను కేటాయించారు.
దరఖాస్తు ఇలా..
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ ను సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు తెలంగాణ అభ్యర్థులకు రూ.200 ఉంటుంది. రిజర్వేషన్ లేని అభ్యర్థులకు మరో రూ.120 ఎగ్జామ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Post a Comment